రాజస్థాన్ లో సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు : ఐదుగురి మృతి

rajasthan road accident
Highlights

మృతుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయ్ పూర్ జిల్లాలోని మౌంట్ అబూ రోడ్డులో  ప్యాణిస్తున్న సీఆర్ఫీఎఫ్ వాహనాన్ని ఓ ట్రాలీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు జవాన్లతో పాటు ట్రాలీలోని ముగ్గురు చనిపోయారు.  

వేగంగా వచ్చిన ట్రాలీ అదుపుతప్పి ఓ బ్రిడ్జిపై నుండి వెళుతున్న సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సీఆర్పీఎఫ్ వాహనం ఆ బ్రిడ్జి కిందకు పడిపోయింది. ప్రమాదానికి కారణమైన ట్రాలీలో మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు కాగా మరో ముగ్గురు ఇతర ప్రయాణికులు ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

loader