రాజస్థాన్ సీఎం నివాసానికి బయలుదేరిన పుల్వామా అమరవీరుల భార్యలపై పోలీసులు దాడికి పాల్పడిన విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, నివేదిక అందజేయాలని రాజస్థాన్ డీజీపీకి లేఖ రాసింది. 

రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చని హామీలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న పుల్వామా అమరవీరుల భార్యలపై రాజస్థాన్ లో పోలీసులు దాడి చేసి కొట్టారనే వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సీ డబ్య్లూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించాలని ఛైర్ పర్సన్ రేఖా శర్మ రాజస్థాన్ డీజీపీకి లేఖ రాశారు. 

బ‌స్త‌ర్ లో కాల్పుల మోత‌.. మావోయిస్టులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు కోబ్రా కమాండోలకు గాయాలు

పోలీసు అధికారులపై మహిళలు చేసిన అసభ్య ప్రవర్తన, దాడి ఆరోపణలపై విచారణ జరపాలని డీజీపీని ఎన్ సీడబ్ల్యూ ఆదేశించింది. సవివరమైన ఏటీఆర్ ను తమకు తెలియజేయాలని ఆ లేఖలో పేర్కొంది. ఈ విషయాన్ని జాతీయ మహిళ కమిషన్ ట్వీట్ చేసింది. 

Scroll to load tweet…

2019 పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల వితంతువులు రాజస్థాన్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ కొంత కాలంగా నిరసన తెలియజేస్తున్నారు. వీరికి రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్ మీనా మద్దతుగా నిలిచారు. వీరంతా జైపూర్ లో ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేకపోతే మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజస్థాన్ గవర్నర్‌కు రాశారు.

కోడలితో మామ ప్రేమాయణం.. ఇల్లు వదిలిపెట్టి పరార్.. ‘నా భార్య మంచిది, నాన్నదే తప్పు’

పుల్వామా అమరవీరుల భార్య మీనాతో కలిసి శనివారం గవర్నర్ ను కలిశారు. తమ సమస్యలకు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. రాజ్ భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నివాసానికి బయలుదేరారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రోహితాశవ్ లాంబా భార్య మంజు జాట్ గాయపడి ఆసుపత్రిలో చేరారు. తమని పోలీసు సిబ్బంది తోసేశారని మీనా ఆరోపించారు. ఈ విషయాన్ని ఓ లేఖలో సీఎం కూడా తెలియజేశారు. అమరవీరుల కుటుంబాల డిమాండ్లను నెరవేర్చడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. ఇటీవల అసెంబ్లీ గేటు వద్ద నిరసన తెలుపుతున్న తమ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆమె తెలిపారు.

సిసోడియా ఒక క్రిమినల్.. ఆయన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయండి : ఎలాన్ మస్క్ కు ఢిల్లీ బీజేపీ విజ్ఞప్తి

అయితే ముగ్గురు సైనికుల భార్యలను పోలీసులు ఈడ్చుకెళ్లి దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆందోళనకారులతో పాటు వచ్చిన బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కల్ రాజ్ మిశ్రాకు వినతిపత్రం అందించిన అనంతరం పోలీసులు తమపైకి దాడి చేశారని ఆయన ట్వీట్ చేశారు.