Asianet News TeluguAsianet News Telugu

టోంక్ కాంగ్రెస్ అభ్యర్ధిగా సచిన్ ...నామినేషన్ దాఖలు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మైనారిటీల ప్రాభల్యం అధికంగా వుండే టోంక్ నియోజకవర్గం నుండి ప్రతిసారి మైనారిటీ  నేతలకే అవకాశం కల్పించే ఆ పార్టీ ఈసారి మాత్రం ఆ సాంప్రదాయాన్ని విరుద్దంగా అభ్యర్థిని ప్రకటించింది. ఆ స్థానం నుండి రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు సచిన్ ఫైలట్ బరిలోకి దిగనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. 

rajasthan pcc chief sachin pilot nomination
Author
Tonk, First Published Nov 19, 2018, 6:28 PM IST

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మైనారిటీల ప్రాభల్యం అధికంగా వుండే టోంక్ నియోజకవర్గం నుండి ప్రతిసారి మైనారిటీ  నేతలకే అవకాశం కల్పించే ఆ పార్టీ ఈసారి మాత్రం ఆ సాంప్రదాయాన్ని విరుద్దంగా అభ్యర్థిని ప్రకటించింది. ఆ స్థానం నుండి రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు సచిన్ ఫైలట్ బరిలోకి దిగనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. 

గత రెండు రోజుల క్రితం ఈ నిర్ణయం  వెలువడ్డా చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు ఉంటేందేమోనని అందరూ భావించారు. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ చివరిరోజైన ఇవాళ సచిన్ నామినేషన్ దాఖలు చేశారు.  కార్యకర్తలు, అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను అందించారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి సచిన్ పోటీ ఖాయమైంది.

ఈ సందర్భంగా సచిన్ మీడియాతో మాట్లాడుతూ...ఈసారి రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. బిజెపి ప్రభుత్వ పాలనలో ఇన్నేళ్లు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని...ఆ వ్యతిరేక ఓట్లన్ని కాంగ్రెస్ పార్టీకి పడతాయని సచిన్ తెలిపాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల భారీ మెజారీటలతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నట్లు సచిన్ ధీమా వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios