అత్యాచార కేసుల్లో రాజస్థాన్ నెంబర్ వన్ అని.. దీనికి కారణం తమది పురుషుల రాష్ట్రం కావడమే అంటూ.. నిస్సిగ్గుగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మంత్రి శాంతి ధరివాల్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో క్షమాపణలు చెప్పడానికి సిద్దమయ్యాడు.
జైపూర్ : అత్యాచారాల విషయంలో Minister of Rajasthan ఒకరు సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘Rape caseల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే.. రాజస్థాన్ పురుషుల రాష్ట్రం’ అని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి Shanti Dhariwal వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో మంత్రి మాటలపై స్థానికంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్ జాద్ ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీ ఈ విషయంలో మౌనం వహిస్తున్నారన్నారు.
జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖ శర్మ సైతం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజస్థాన్ ప్రభుత్వంలో ఇలాంటి మంత్రులు ఉన్నారు. అందుకే రాష్ట్రంలోని మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారు. పోలీసులు ఏమీ చేయడం లేదు. ఇలాంటి రాష్ట్ర మహిళలు ఉంటే రాష్ట్ర మహిళలు ఎలా సురక్షితంగా ఉంటారు?’ అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సంబంధిత మంత్రిని సభ నుంచి సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజస్థాన్ స్పీకర్ సిపి జోషీకి లేఖ రాశారు. అయితే.. తాను నోరు జారానని, క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని సదరు మంత్రి ప్రకటించారు. తాను ఎల్లప్పుడూ మహిళలను గౌరవిస్తానని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 10న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. తరచూ వివాదాల్లో ఉండే BJP MLA Renukacharya మళ్లీ వివాదాన్ని రేకెత్తించారు. మహిళల Clothesను చూసి పురుషులు ఉద్రేకానికి గురవుతారని ఆయన బుధవారం ఢిల్లీలో అన్నారు. Women Bikini ధరించటం వారి హక్కు అని కాంగ్రెస్ నాయకురాలు Priyanka Gandhi చెప్పడాన్ని ఖండించారు. ఆమె దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కొన్నిసార్లు మహిళల వస్త్రధారణ పురుషులకు ఉద్రేకాలను కలిగిస్తుందని ఆయన అన్నారు.
ఆయన మాటలమీద విమర్శలు రావడంతో తను చేసిన వ్యాఖ్యలమీద మహిళలకు క్షమాపణలు చెప్పారు. స్త్రీలను అవమానించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని తెలిపారు. ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలు.. మహిళలను అవమానించేలా ఉన్నాయని అన్నారు. ఆమె మహిళలకు క్షమాపణలు చెప్పాలని రేణుకాచార్య డిమాండ్ చేశారు.
