అమ్మా నేనేం పాపం చేశాను.. నా నోరు మూసేశావు!
ఉదయ్‌పూర్‌లో మానసిక వికలాంగురాలు తన మైనర్ కొడుకును గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అంబా మాత పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం ఈ సంఘటన జరిగిందని తెలిపారు. పైగా హంతకురాలే.. పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి.. తన కొడుకును చంపినట్లు తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సభ్య సమాజం నిర్ఘాంతపోయే ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన పేగు బంధాన్ని మరిచింది. తన కొడుకు పాలిట శత్రువుగా మారింది. మానసిక వికలాంగురాలైన ఓ తల్లి తన మైనర్ కొడుకును గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటన అంబా మాత పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మానసిక స్థితిలో సరిగాలేక..
ఈ ఘటనపై అంబమట పోలీస్ స్టేషన్ ఆఫీసర్ హనువంత్ సింగ్ రాజ్‌పురోహిత్ మాట్లాడుతూ.. ఈ సంఘటన ఉదయం 6.30 గంటలకు జరిగింది. పురంజయ్ నిద్రపోతున్నాడు. చి ఆ సమయంలో మనీషా.. తన కొడుకు మెడకు తాడు బిగించి హత్య చేసింది. ఆ బాలుడు 3 నుంచి 4 నిమిషాల పాటు పోరాడి ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో.. హంతకురాలే కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి, తన కుమారుడిని తానే హత్య చేశానని స్వయంగా చెప్పింది.
అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. హత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. వారు ఎలాంటి గొడవలు,వివాదాల జరగలేదని తెలిపారు. మనీషా గత కొన్ని ఏండ్లుగా మానసిక అనారోగ్యంతో భాదపడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె 2018 నుండి చికిత్స పొందుతుందనీ,వైద్య పత్రాల పరిశీలన ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
తండ్రి మార్నింగ్ వాక్‌లో.. తాత, మామ ఇంట్లో
తండ్రి దీపక్ పారిఖ్ (44)కు ఎలక్ట్రానిక్స్ దుకాణం ఉందని, అతను ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లాడు. మార్నింగ్ వాక్ నుంచి వస్తుండగా కూరగాయలు తీసుకురావాలని భర్త దీపక్‌ను మనీషా చెప్పింది. ఈ దారుణం జరిగినప్పుడు.. తాత, అమ్మమ్మ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉన్నారు. కానీ ఈ దారుణాన్ని గమనించలేరు. దీపక్ పారిఖ్ కుటుంబం మొదటి అంతస్తులో నివసిస్తోంది. ఘటన జరిగిన సమయంలో తాత, అమ్మమ్మ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నారు. తలుపు తీయకపోవడంతో పోలీసులు పైకప్పు నుంచి నిచ్చెనతో ఇంట్లోకి చేరుకున్నారు
3 రోజుల క్రితం పుట్టినరోజు వేడుకలు
మూడు రోజుల క్రితం జూలై 27న పారిఖ్ కుటుంబం పురంజయ్ పుట్టినరోజును జరుపుకున్నట్లు సహేలీ నగర్ నివాసితులు తెలిపారు. చుట్టుపక్కల వారు ఆ మహిళ మానసిక అనారోగ్యంతో ఎప్పుడూ కనిపించలేదని చెప్పారు. ఈ వ్యాధి గురించి బంధువులు దాచిపెట్టే అవకాశం ఉంది. మనీషా తరచూ బయట కనిపించేది. కానీ ఎప్పుడూ అలా కనిపించలేదని చెప్పుతున్నారు.