రాజస్తాన్‌లో భార్యను వెంట తీసుకెళ్లడానికి అత్తారింటికి చేరాడు 24 ఏళ్ల ఈశ్వర్ సింగ్. కానీ, ఆమెను పంపించడానికి అత్త ససేమిరా అన్నది. దీంతో అత్తనే తన వెంట రమ్మని ఈశ్వర్ సింగ్ గ్రామానికి చేరువైన తర్వాత ఉరి వేసి చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య .. భర్తపై కేసు పెట్టింది. పోలీసులు ఈశ్వర్ సింగ్ కోసం గాలింపులు జరుగుతున్నాయి.
జైపూర్: రాజస్తాన్‌లో దారుణం జరిగింది. ఆ జంట ఈ ఏడాది మే నెలలోనే పెళ్లి చేసుకుంది. నవవధువు వారి అమ్మ వద్దకు వెళ్లింది. ఆమెను తీసుకురావడానికి అత్తవారి ఇంటికి ఆమె భర్త వెళ్లాడు. కానీ, బిడ్డను అల్లుడితో పంపడానికి అత్త నిరాకరించింది. దీంతో ఆ నవవరుడికి కోపం తీవ్రతరమైంది. కానీ, భార్యను పంపించని అత్తను తనతోపాటు తన ఊరికి రావాల్సిందిగా నచ్చజెప్పాడు. ఊరికి తీసుకువచ్చిన తర్వాత ఆమెను చంపేశాడు. ఆ వృద్ధురాలిని ఉరి వేసి చంపేసినట్టు ఉదయ్ పూర్ పోలీసులు మంగళవారం వెల్లడించారు.
24 ఏళ్ల ఈశ్వర్ సింగ్ మే నెలలో పెళ్లి చేసుకున్నాడు. తన భార్యను తీసుకువచ్చుకోవాలని అత్తగారింటికి వెళ్లాడు. కానీ, బిడ్డను అల్లుడితో పంపించడానికి నిరాకరించింది. దీంతో ఈశ్వర్ సింగ్ తీవ్రంగా మండిపడ్డాడు. తన బిడ్డను పంపించకుంటే అత్తనే తనతో తన గ్రామానికి రావాలని కోరాడు. రాజ్‌సమంద్ డంపింగ్ యార్డ్‌లో సోమవారం ఆమెను ఉరేసి చంపేశాడు.
తన తల్లి గీతా కన్వార్ ఈశ్వర్ సింగ్ భార్య ఫోన్ చేసే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. ఈశ్వర్ సింగ్‌కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది. తన తల్లిని చంపేశాడని తెలిసిన తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఈశ్వర్ సింగ్ పై హత్యారోపణలతో కేసు పెట్టింది.
Also Read: భర్తను నల్లవాడని పిలవడం క్రూరత్వమే: దంపతులకు విడాకులు మంజూరు చేసిన హైకోర్టు
గీతా కన్వార్‌కు ఉదయ్ పూర్‌లోని ఎంబీ హాస్పిటల్‌లో పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత మంగళవారం ఉదయం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
నిందితుడు ఈశ్వర్ సింగ్ పై సుఖేర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపులు జరుపుతున్నామని డీఎస్పీ చేతనా భాతి తెలిపారు.
