Asianet News TeluguAsianet News Telugu

భార్యను తల్లిని చేసేందుకు జీవితఖైదీకి బెయిల్... రాజస్థాన్ కోర్టు మంజూరు..

రాజస్థాన్ కోర్టు ఇచ్చిన ఓ బెయిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జీవితఖైదీకి భార్యను తల్లిని చేసేందుకు బెయిల్ మంజూరు చేయడమే దీనికి కారణం.

Rajasthan high court grants bail to life prisoner to make wife a mother
Author
First Published Oct 17, 2022, 10:05 AM IST

రాజస్థాన్ : అతనో జీవిత ఖైదీ.. ఓ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన కేసులో అతడికి కోర్టు 20యేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో తాను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య తాను తల్లిని కావాలనుకుంటున్నానంటూ కోర్టు మెట్లెక్కింది. భర్తకు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ వేసింది. భార్యను తల్లిని చేసేందుకు కోర్టు పెరోల్ బెయిల్ మంజూరు చేసింది. ఈ విచిత్రమైన కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెడితే.. 

రాజస్థాన్ కు చెందిన రాహుల్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో 20యేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని రాహుల్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ సమీర్ జైన్ లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిసనర్ కోరికను మన్నించింది. దోషి భార్య పిల్లలు కావాలని కోరుకుంటోందని, భర్త లేకుండా, భర్త నుంచి పిల్లలు కలగకుండా ఉండే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదని కోర్టు స్పష్టం చేసింది. 

రూ. 30 కోట్ల విలువైన రెండున్నర కేజీల పాము విషం స్మగ్లింగ్..ఎక్కడంటే..

ఆమెన తన వంశం పరిరక్షణ కోసమే పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొంది. పిటిషన్ ను తిరస్కరిస్తే హక్కులను కాలరాసినట్టే అవుతుందన్న కోర్టు.. దోషికి 15 రోజుల పెరోల్ మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతోపాటు లక్ష రూపాయల చొప్పున రెండు జామీను బాండ్లు సమర్పించి పెరోలు పొందొచ్చని సూచించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios