Asianet News TeluguAsianet News Telugu

హెలికాప్టర్ లో బరాత్ : వధువు ఈ షరతు పెడితే.. అబ్బాయిలు ఔట్....

పిండికొద్దీ రొట్టే అన్నట్టు.. ఎంత ఎక్కువ డబ్బులుంటే అంత గ్రాండ్ గా పెళ్లిళ్లు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ లకే లక్షల కొద్దీ తగలేస్తున్నారు. ఇక మెహందీలు, సంగీత్ లు, బారాత్ లు.. అదీ, ఇదీ అంటూ ఎన్నో రకాలుగా చేస్తున్నారు. 

rajasthan helicopter wedding viral on social media - bsb
Author
hyderabad, First Published Feb 25, 2021, 1:11 PM IST

పిండికొద్దీ రొట్టే అన్నట్టు.. ఎంత ఎక్కువ డబ్బులుంటే అంత గ్రాండ్ గా పెళ్లిళ్లు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ లకే లక్షల కొద్దీ తగలేస్తున్నారు. ఇక మెహందీలు, సంగీత్ లు, బారాత్ లు.. అదీ, ఇదీ అంటూ ఎన్నో రకాలుగా చేస్తున్నారు. 

ఆ పెళ్లి ఖర్చుతో ఓ ఊరు ఊరు నెలరోజుల పాటు తృప్తిగా భోంచేయగలుగుతుంది. ఇపుడిదంతా ఎందుకు అంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియో ‘హెలికాప్టర్‌ వెడ్డింగ్’‌ పేరుతో ట్రెండ్‌ అవుతోంది. ఓ జర్నలిస్ట్ ఈ పెళ్లిని రిపోర్ట్ చేయడం కొసమెరుపు. 

పూర్తి వివరాల్లోకి వెడితే.. రాజస్తాన్‌లోని షేఖావతిలో ఈ నయా వివాహ వేడుక చోటు చేసుకుంది. రతన్ గఢ్, తహసీల్ లో ఓ చిన్న గ్రామానికి చెందిన కోటీశ్వరుడు తన కుమారుడి కోరిక మేరకు ‘బరాత్’ వేడుక కోసం హెలికాప్టర్ ని రంగంలోకి దించాడు. 

వివాహం పూర్తైన వెంటనే కొత్త జంటబరాత్‌ వేడుక కోసం హెలికాప్టర్‌లో ఎక్కి ఊరేగింది. ఈ తతంగాన్ని రిపోర్ట్ చేయడం కోసం ఓ జర్నలిస్ట్ ని కూడా నియమించుకున్నాడు ఆ పెళ్లి కొడుకు తండ్రి.

ఆ రిపోర్టర్ కూడా తన క్రియేటివిటీని బాగా ఉపయోగించాడు. వివాహం జరగుతున్న చోట ఉన్న పరిస్థితులు, వధువు రియాక్షన్, వరుడి రియాక్షన్.. లాంటి విషయాలన్నీ పూస గుచ్చినట్లు రిపోర్డ్‌ చేశాడు.

కుమారుడి సంతోషషం కోసం ఓ తండ్రి చేసిన ప్రయత్నం అనే కామెంటరీతో ప్రారంభమయ్యే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios