రాజస్థాన్ రాజకీయ సంక్షోభంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విజయం సాధించారు. శుక్రవారం అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో గెహ్లాట్ సర్కార్ గెట్టెక్కింది. మూజువాణి ఓటుతో ప్రభుత్వం విజయం సాధించినట్లు స్పీకర్ ప్రకటించారు.

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి కుమార్ ధారివాల్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అశోక్ బీజేపీకి గుణపాఠం చెప్పారని ప్రశంసించారు.

Also Read:సొంతగూటికి సచిన్: గెహ్లాట్‌‌ను వదిలేది లేదు, అవిశ్వాసాస్త్రం సంధించనున్న బీజేపీ

గోవా, మధ్యప్రదేశ్ తరహా ఘటనలు ఆయన రాజస్థాన్‌లో పునరావృతం కానివ్వలేదని కుమార్ ధారివాల్ వెల్లడించారు. కరోనా సమయంలో సంక్షోభాన్ని క్రియేట్ చేసి అదే సమయంలో బీజేపీ నేత ముఖ్యమంత్రి కావడంతో కాషాయ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారని ఆయన చెప్పారు.

దీని కారణంగా మధ్యప్రదేశ్‌లో కరోనా ప్రబలిందని ధారివాల్ వెల్లడించారు. విశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం ఈ నెల 21వ తేదీకి సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.