దారుణం: కొడుకు పుట్టాలని 4 ఏళ్ళ కూతురిని బలిచ్చిన తండ్రి

Rajasthan: Father sacrifices 4-year-old daughter hoping for a boy
Highlights

అల్లా కోసం కూతురిని బలిచ్చిన తండ్రి

జైపూర్: రంజాన్ మాసంలో కూతురిని బలిస్తే కొడుకు పుడతాడని భావించిన  ఓ తండ్రి అత్యంత దారుణంగా  నాలుగేళ్ళ కూతురిని ఖురాన్ పఠిస్తూ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్తాన్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్‌లో నవాబ్ అలీ ఖురేషీకి భార్య, కూతురు రిజ్వానాలు ఉన్నారు. అలీ భార్య తరుపు బంధువులు వారు నివాసం ఉంటున్న కింది పోర్షన్ లోనే ఉంటున్నారు.

నవాబ్‌ అలీ ఖురేషీకి నాలుగేళ్ల రిజ్వాన్‌ అనే కూతురు ఉంది. శుక్రవారం వేకువజామున రెండున్నర గంటల సమయంలో అలీ తన స్వహస్తాలతో కూతురిని గొంతు కోసి  అల్లాకు కానుకగా సమర్పించాడు. అనంతరం తాను ఏమీ ఎరగనట్లు వచ్చి భార్య పక్కన పడుకున్నాడు.  

కానీ, తన కూతురు కన్పించడం లేదని భార్యతో కలిసి అతను కూడ వెతికాడు. అయితే కిందకు వచ్చి చూడగానే రక్తపు మడుగులో కూతురు కన్పించేసరికి భార్య కేకలు వేసింది. దీంతో అలీ అక్కడికి వచ్చి చూశాడు. అయితే  తన కూతురిని పిల్లి కరిస్తే చనిపోయిందని అలీ కుటుంబసభ్యులను నమ్మించే ప్రయత్నించాడు అలీ.

పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే డాగ్‌స్వ్కాడ్ ఇళ్ళంతా పరిశీలించింది. అయితే పోలీసులకు అలీపై అనుమానం వచ్చింది.ఈ విషయమై అలీని ప్రశ్నిస్తే అతను అసలు విషయాన్ని ఒప్పుకొన్నాడు. అల్లా కోసమే తాను తన కూతురిని హత్య చేసినట్టుగా ఆయన  ఒప్పుకొన్నాడు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిపడ్‌ నగర ఆసుపత్రికి తరలించారు.  నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

loader