Rajasthan Election Result 2023: రాజ‌స్థాన్ లో బీజేపీ జోరు.. వెనుకంజ‌లో కాంగ్రెస్

Rajasthan Election Result: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం తొలి ట్రెండ్స్ వెల్లడవ్వడంతో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందంజలో ఉంది. ప్ర‌స్తుతం బీజేపీ 115 స్థానాల్లో, కాంగ్రెస్ 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇత‌రులు 10 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు.
 

Rajasthan Election Result 2023:BJP is leading in 115 seats while the Congress is leading in 72 seats RMA

Rajasthan Assembly Election Result 2023: మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, చత్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొన‌సాగుతోంది. ఇక రాజ‌స్థాన్ లో బీజేపీ జోరు కొన‌సాగుతోంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం తొలి ట్రెండ్స్ వెల్లడవ్వడంతో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందంజలో ఉంది. ప్ర‌స్తుతం బీజేపీ 115 స్థానాల్లో, కాంగ్రెస్ 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇత‌రులు 10 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. 

కాగా, 2023 నవంబర్ 7 నుంచి 2023 నవంబర్ 30 వరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. చత్తీస్ గఢ్ లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా, భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. 2023 చివరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 లో కీలకమైన లోక్ స‌భ‌ న్నికలకు కూడా టోన్ సెట్ చేస్తాయి.మధ్యప్రదేశ్ లో బీజేపీ నుండి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తూనే రాజస్థాన్, చత్తీస్ గ‌ఢ్ ల‌లో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అదే సమయంలో బీజేపీ బిగ్ ఫైట్ చేస్తోంది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios