రాజస్థాన్ రాజకీయం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏ పార్టీకి, ఆ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టు రాజకీయాలు మొదలుపెట్టాయి.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కొత్త ఎత్తు వేశారు. ‘‘ సత్యం వైపు నిలవండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కాంగ్రెస్ సహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు లేఖ రాశారు.

Also Read:టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనమైతే కరెక్ట్, ఇది తప్పా?: రాజస్థాన్ సీఎం గెహ్లాట్

ప్రజలు మనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా... చెడు సంప్రదాయాలవైపు మొగ్గొద్దు. మీరు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ ప్రజల మనోభావాలను, ఎన్నికైన ప్రభుత్వం ప్రజల కోసం ఎలా పనిచేస్తోందనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. మీరు సత్యం వైపపే నిలుస్తారన్న నమ్మకం నాకుందని అశోక్ అన్నారు.

ప్రజలికిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వానికి సహకరిస్తారని నమ్ముతున్నా అని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా క్లిష్ట సమయంలో ప్రజల ప్రాణాలు, ఆర్ధిక వ్యవస్థ, ఉద్యోగాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందన్నారు.

Also Read:మూడోసారి గవర్నర్ నుండి ఆశోక్ గెహ్లాట్‌కు చుక్కెదురు: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నో

ఇందుకోసం  ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందన్నారు. ఇలాంటి సమయంలో కొందరు సహచరులు, ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నడం దురదృష్టకరమన్నారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఈ సమావేశాల్లో బలపరీక్ష నిర్వహించాలని అశోక్ భావిస్తున్నారు. ఇప్పటికీ ఆయనకు మద్ధతు ఉందని, అరకొర మెజార్టీతోనైనా గట్టెక్కుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇకపోతే సీఎం ఒత్తిళ్ల నుంచి రక్షించేందుకు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను గుజరాత్‌ని రిసార్ట్‌కు తరలించింది హైకమాండ్.