Asianet News TeluguAsianet News Telugu

టీచర్ల బదిలీలకు లంచాలు.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు షాకింగ్ సమాధానం..

రాజస్థాన్ ముఖ్యమంత్రి ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డారు. విద్యాశాఖలో లంచాల విషయంలో ఆయన అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. దీంతో అశోక్ గెహ్లాట్ పబ్లిక్ మీటింగ్ లో కాస్త ఇబ్బందుల్లో పడ్డారు. ఏంటీ విషయం అన్నట్టుగా స్టేజ్ మీదున్న విద్యాశాఖ మంత్రివైపు ఓ చూపు విసిరారు. 

Rajasthan CM ashok gehlot surprised and embarrassed after bribery in education department
Author
Hyderabad, First Published Nov 17, 2021, 12:52 PM IST

న్యూఢిల్లీ : Rajasthan ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంగళవారం (నవంబర్ 16, 2021) జైపూర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అవార్డు ప్రదానోత్సవంలో ఉపాధ్యాయులు బదిలీలకు సంబంధించిన వ్యవహారంలో education departmentలో లంచాల ప్రాబల్యం ఉందన్న విషయాన్ని గురించి ఆయన అడిగిన ప్రశ్నకు "అవును" అని ప్రతిస్పందనలు రావడంతో.. ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. 

ఉపాధ్యాయులకు వారి పదవీకాల వ్యవధి గురించి స్పష్టంగా తెలిసి ఉంటుంది. అందుకే పారదర్శక బదిలీ విధానం ఆవశ్యకత గురించి తెలిసి ఉండాలని గెహ్లాట్ మాట్లాడారు. అయితే విద్యాశాఖలో తమకు కావాల్సిన ప్రాంతానికి "బదిలీల కోసం అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారని,  bribery నడుస్తున్నాయని మేము వింటున్నాం. అది నిజమో కాదో నాకు తెలియదు. డబ్బులు అడుగుతున్నారా?" అని Ashok Gehlot అడిగారు. దీనికి ప్రేక్షకుల నుంచి ‘అవును’ అని ముక్తకంఠంతో సమాధానం వచ్చింది. 

ఆ సమాధానంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆశ్చర్యపోయారు. 'కమాల్ హై' అరే చాలా ఆశ్చర్యంగా ఉంది.. అంటూ ప్రతిస్పందించారు. సర్ ఫ్రైజింగ్ గా ఉంది అన్నట్టుగా వేదికపై ఉన్న రాజస్థాన్ పాఠశాల విద్యా మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా వైపు చూశారు.

‘‘డబ్బులు చెల్లించి బదిలీలు చేయించుకోవాలని ఉపాధ్యాయులు ఉవ్విళ్లూరుతుండడం చాలా బాధాకరం. ఒక పాలసీని రూపొందించి పదవీకాలం ఒకటి, రెండేళ్లు, మూడేళ్లు ఉందో లేదో తెలుసుకోవాలి.. డబ్బులు చేతులు మారవు. మీరు అభ్యర్థనలతో ఎమ్మెల్యే వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు" అని ఆయన స్పందించారు.

ఉపాధ్యాయులు పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా చూడాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. "మీ కర్తవ్యం చక్కటి బోధన అందించడం.. అలాంటి మీ పాత్రలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. మిగిలిన వాటిని మాకు వదిలేయండి. schoolsల్లో సరైన విద్యను అందించడమే మీ కర్తవ్యం" అని గెహ్లాట్ అన్నారు.

పిల్లలలో సరైన విలువలు పెంపొందించాలని ఉపాధ్యాయులను కోరారు. ఉపాధ్యాయులు బదిలీ విధానం గురించి మాట్లాడారని, ఇది "తీవ్రమైన సమస్య" అని అన్నారు. దీనిపై మంత్రికి సూచనలివ్వండి అన్నారు. కడుపు మంట లేని విధంగా బదిలీ విధానం ఉండాలి’’ అని chief minister అన్నారు. బదిలీల కోసం ప్రజలు ప్రజాప్రతినిధులను సంప్రదించారని, వారు మంత్రిపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు.

Netaji: మహాత్మా గాంధీ.. సుభాష్ చంద్రబోస్‌ల మధ్య కఠిన సంబంధాలు: నేతాజీ కూతురు అనితా బోస్

ఇదిలా ఉండగా, గత నెలలో రాజస్తాన్‌లో మరోసారి మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపి వేశారు. దీంతో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష సందర్బంగా అక్టోబర్ 27, బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. 

పరీక్ష లీక్ కాకుండా ఉండేందుకు, చీటింగ్, కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఇలా చేయడం మీద పలువురు నెటిజన్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీద కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios