Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీకి చేరుకున్న రాజస్థాన్ సీఎం : సోనియాతో భేటీ కానున్న ఆశోక్ గెహ్లాట్

రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ బుధవారం నాడు ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో గెహ్లాట్ సమావేశం కానున్నారు. రాజస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గెహ్లాట్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత నెలకొంది. 

Rajasthan Chief Minister Ashok Gehlot  leaves For Delhi To meet Sonia Gandhi
Author
First Published Sep 28, 2022, 1:14 PM IST

న్యూఢిల్లీ: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బుధవారం నాడు ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీతో ఆయన బేటీ కానున్నారు.రాజస్థాన్ లో చోటు చేసుకకున్న పరిణామాల నేపథ్యంలో  సోనియాతో  గెహ్లాట్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారనే ప్రచారం గతంలో సాగింది.  రాజస్థాన్  రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షపదవి రేస్ నుండి తప్పుకున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

ఈ పదవికి దిగ్విజయ్ సింగ్, మల్లిఖార్జున ఖర్గే వంటి నేత పేర్లు కూడా విన్పిస్తున్నాయి. రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలెట్ ను గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. తాము రాజీనామాలు సమర్పించారు.. ఈ పరిణామాలపై పార్టీ నాయకత్వానికి గెహ్లాట్ క్షమాపణలు చెప్పారు. ఆదివారం నాడు 82 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ జోషీకి తమ రాజీనామా లేఖలను అందించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ ఎంపికైతే సచిన్ పైలెట్ ను సీఎం పదవిని సచిన్ పైలెట్ కు అప్పగించాలని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. అయితే ఈ ప్లాన్ కు గెహ్లాట్ వర్గం  ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి చెక్  పెట్టారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, మల్లిఖార్జున ఖర్గేలు పార్టీ నాయకత్వానికి నివేదిక ఇచ్చారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios