కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన మిత్రులకు పన్నులు తక్కువగా విధిస్తోందని, కానీ సామాన్య ప్రజలపై పన్నుల భారం వేస్తోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆహార భద్రతా చట్టం, ఉపాధి హామీ పథకం వంటి సంక్షేమ పథకాలను పేదరిక నిర్మూళన కోసం రూపొందించారని చెప్పారు. 

సామాన్య ప్రజలపై పన్నులు పెంచి, మిత్రులకు పన్నులు తగ్గించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ప్రజలకు, కార్పొరేట్‌ సంస్థలపై విధించిన పన్నులపై ఆయ‌న మండిప‌డ్డారు. రుణాలను మాఫీ చేయడం అసలైన ‘ఉచితం’ అని ఆరోపించారు. 

అది ‘ఆప్’ కాదు ‘పాప్’ - ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ పై బీజేపీ మండిపాటు

‘‘ ప్రజలపై పన్నులు పెంచండి, మిత్రుల కోసం పన్నులు తగ్గించండి.’’ అని ఆయన ట్వీట్ చేశారు. సూట్-బూట్-దోపిడీ సర్కార్ కోసం ‘సహజ చర్య’ అంటూ ఓ గ్రాఫిక్ ఇమేజ్ ను పంచుకున్నారు. ప్ర‌స్తుత బీజేపీ పాల‌న అలాగే కాంగ్రెస్ పాల‌న‌లోని ప‌న్నుల‌ను పోల్చారు. బీజేపీ ప్రజలపై పన్ను అధికంగా వేస్తుంద‌ని, కార్పొరేట్ల‌పై త‌క్కుగా ప‌న్న వేస్తోంద‌ని, ఆ పార్టీ ఇదే విధానాన్ని ఎంచుకుంద‌ని చెప్పారు. కాగా అంతకు ముందు జూలైలో గాంధీ కొన్ని వస్తువులపై GST రేట్లను పెంచడాన్ని విమ‌ర్శిస్తూ.. దానిని ‘గబ్బర్ సింగ్ టాక్స్’గా పేర్కొన్నారు. కేంద్రాన్ని విమర్శించారు.

Scroll to load tweet…

అయితే తాజాగా ఆహార భద్రతా చట్టం, MGNREGA వంటి సంక్షేమ పథకాలు, పేదరికం నుండి ప్రజలను బయటకు తీసుకురావడానికి రూపొందించిన కార్యక్రమాలు అని, అవి ఉచితాలు కావాలని నొక్కి చెప్పింది. పేదలకు ఇచ్చే చిన్న మొత్తాలు లేదా సహాయం ‘ఉచితాలు’గా వర్గీకరించబడిందని, అయితే ప్రభుత్వ ధనిక మిత్రులు తక్కువ పన్ను రేట్లు, మినహాయింపుల ద్వారా పొందుతున్న ఉచితాలను అవసరమైన ప్రోత్సాహకాలుగా బీజేపీ వర్గీకరించిందని ’’ కాంగ్రెస్ పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు మాఫీ చేసిన రుణాల్లో రూ.7.27 లక్షల కోట్లు బదిలీ చేయగా, ప్రభుత్వ ఖజానాకు రూ.5.8 లక్షల కోట్ల నష్టం కలిగిందని తెలిపింది.

ఐసిస్‌ చేరిన కేరళ వ్యక్తి.. లిబియాలో ఆత్మహుతి దాడి మిషన్‌లో పాల్గొని మృతి..!

‘‘ఆహారభద్రత చట్టం, రైతులకు ఎంఎస్‌పీ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ, ఎండీఎం వంటి పథకాలు ఉచితంగా వచ్చి విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. అయితే కార్పొరేట్‌ కంపెనీల తగ్గింపుతో ప్రభుత్వానికి ఏటా రూ.1.45 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందన్న చర్చ ఎప్పుడు వస్తుంది ’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ప్రశ్నించారు.