హిస్సార్ నుంచి కోచిబెల్లి వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించబటడం ఓ కుటుంబంలో ఆందోళనకు కారణమైంది. అయితే రైల్వే ఉన్నతాధికారి ఒకరు వారి కాల్స్‌కు స్పందించి.. సాయం అందించడంతో ఆ కుటుంబం ఎంతో ఆనందంలో మునిగిపోయింది.
హిస్సార్ నుంచి కోచిబెల్లి వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించబటడం ఓ కుటుంబంలో ఆందోళనకు కారణమైంది. అందుకు కారణం.. ఆ రైలులో ఆ కుటుంబానికి చెందిన వయసు పైబడిన ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తూ ఉండటమే. దీంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వారు రైల్వే అధికారులను సంప్రదించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు రైల్వే ఉన్నతాధికారి ఒకరు వారి కాల్స్‌కు స్పందించి.. సాయం అందించడంతో ఆ కుటుంబం ఎంతో ఆనందంలో మునిగిపోయింది. దీంతో వారు రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించి వారు షేర్ చేసుకున్న అనుభవం..
84 ఏళ్ల సుబ్రమణ్య, దాదాపు 70 ఏళ్ల వయసు గల చంద్రశేఖర్, నాగరత్నలతో కలిసి అహ్మదాబాద్ నుంచి ఉడిపి చేరుకునేందుకు హిస్సార్- కోచిబెల్లి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. అయితే రైలు ముంబైలోని వాసాయి నుంచి రైలు దారి మళ్లించబడింది. బెంగళూరులోని యలహంక, కెఆర్ పురం స్టాప్‌ల మీదుగా మీదుగా కోయంబత్తూరు చేరుకుంటుందని మాకు సందేశం అందింది. దీంతో మేమంతా ఉడిపిలో కాకుండా బెంగళూరులో వారిని రిసీవ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేవు. కానీ.. రైలు దారి మళ్లిన తర్వాత మేము రైలు ప్రయాణిస్తున్న మార్గాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు.
దీంతో మేము ఆందోళన చెందాం. వారిని ఎక్కడ రిసీవ్ చేసుకోవాల అర్థం కాకుండా పోయింది. వెంటనే 139కి కాల్ చేయడం ద్వారా కస్టమర్ కేర్ సెంటర్‌ను సంప్రదించాం. అయితే ఆ తర్వాత రైలు ఎక్కడా ఆగదని తెలిసింది. అప్పుడు టెన్షన్ మొదలైంది. మేము కూడా భయంతో రైలులో ఉన్న ముగ్గురు పెద్దలతో దాని గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. వారు అదనంగా 10 గంటలు ఆహారం తీసుకున్నారు. తర్వాతి రోజుకు సరిపోయేంతా ఆహారం వారి వద్ద లేదు. అయితే బయట ఆహారం తీసుకునే పరిస్థితి వారికి లేదు. దీంతో కోయంబత్తూరు వెళ్లి వారిని రిసీవ్ చేసుకోవాలని ఆ పరిస్థితిలో మేము అనుకున్నాం. అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాం. రైలు ట్రాకింగ్ గురించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో చివరి స్టేషన్‌లోనే వారిని రిసీవ్ చేసుకోవాలనే ఆలోచన మాకు ఆప్షన్‌గా కనిపించింది.
అయితే నా సహోద్యోగులలో ఒకరి నుండి ఎలాగోలా రాత్రికి పీఆర్‌వో అనిష్ నెంబర్‌ను పొందాను. మొత్తం సమాచారం ఇస్తూ టెక్స్ట్ చేశారు. అతడు శాయశక్తులా ప్రయత్నించాడు. అయితే రాత్రి 11 గంటల సమయం కావడంతో అధికారులెవరనీ సంప్రదించలేకపోయారు. కానీ, నైరుతి రైల్వే సీనియర్ డీసీఎం డాక్టర్ ఏఎన్ కృష్ణారెడ్డి ఫోన్ నెంబర్‌ను నాకు పంపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా నేను వెంటనే ఆయనకు ఫోన్ చేశాను. ఇంత సీనియర్ అధికారి రాత్రి 11 గంటలకు నా కాల్‌ని స్వీకరిస్తారని నేను ఎలా ఆశించగలను? అస్సలు ఆశలు పెట్టుకోలేదు. కానీ రైలులోని ప్రయాణికుల ఆరోగ్యం గురించిన మొత్తం సమాచారంతో కూడిన సందేశాలను పంపాను. ఆయన 10 నిమిషాల తర్వాత కూడా నా సందేశాలను చూడలేదు. 20 నిమిషాల తర్వాత వాటిని చూసినందుకు దేవునికి ధన్యవాదాలు. కానీ.. అస్సలు స్పందన లేదు. ఉదయం కోయంబత్తూరుకు బయలుదేరడం తప్ప మార్గం లేకుండా పోయింది.
కానీ.. కాసేపటికే నా ఫోన్ మోగడం ప్రారంభించింది. అవును అది డాక్టర్ ఏఎన్ కృష్ణారెడ్డి నుండి వచ్చిన కాల్. కాల్ లిఫ్ట్ చేయగానే గొణుగుడు మొదలెట్టాను. రైలు ఆపుతారనే ఆశ లేదు.. కానీ వీలైతే మరో విధంగా సహాయం చేస్తారని అనుకున్నాను. కానీ నా ఆలోచన తప్పని తెలిసింది. ఆయన అప్పటికే రైలును ట్రాక్ చేశారు. ఆయన నాకు డయల్ చేసే ముందు బెంగుళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్‌లో రైలును ఆపమని కంట్రోల్ రూమ్‌ని ఆదేశించారు. కానీ.. ఆయన కూల్‌గా ఉన్నారు. రైలు ఆగుతుందనే హామీ ఇవ్వడమే కాకుండా.. రైలు ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం చేరుకోగానే నైరుతి రైల్వేకు చెందిన టీటీ అక్కడ బాధ్యతలు చేపడతారని.. రైలు రాక సమయం, ఇతర సమాచారం గురించి స్పష్టమైన వివరాలు ఇవ్వగలనని కూడా నాకు చెప్పారు. చాలా బాధ్యతలు నిర్వహిస్తున్న అటువంటి అధికారికి చేసిన ఈ పని నిజంగా చాలా గొప్ప సంకేతం.
అప్పుడు మేము కోయంబత్తూరుకు వెళ్లే ప్రణాళికను విరమించుకున్నాము. రైలు ధర్మవరం చేరుకోగానే మళ్లీ మెసేజ్ చేశాను. ఆయన అప్పుడు.. కేఆర్ పురం స్టేషన్‌కి రైలు ఎన్ని గంటలకు చేరుకుంటుందనేది నాకు తెలియజేశారు. ఎందుకంటే అతను ఇప్పటికే కంట్రోల్ రూమ్‌ని ఐదు నిమిషాలు ఆపమని ఆదేశించారు. రైలు సాయంత్రం 5.45 గంటలకు చేరుకోవాల్సి ఉంది. కానీ ఇంజన్ డివియేట్ కావడంతో సాయంత్రం 6.15 గంటలకు చేరుకుంది. ఆ అరగంట మా అందరికీ చాలా కీలకమైన సమయం. సాహిత్యపరంగా చెప్పాలంటే.. ఇది చివరి ప్రసవ నొప్పులను కలిగి ఉంది. మేము రైలును చూడగానే.. నా గుండె చప్పుడు పెరిగింది. అవును.. ఏఎన్ కృష్ణారెడ్డి చెప్పినట్టుగానే రైలు ఆగింది. చివరకు మా పెద్దలను రిసీవ్ చేసుకోగలిగాం.
అయితే ఈ విషయాలన్నీ రైలులో ఉన్న మా నాన్నకు కూడా తెలియదు. రైలు ఆగే వరకు ఆయన ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్నారు. కానీ.. మేము బ్యాకెండ్‌లో చేసిన అన్ని కార్యకలాపాల గురించి అంటీకి తెలియజేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కోయంబత్తూరు చేరుకున్నారని నాన్నకు తెలిస్తే ఏదైనా జరిగేది. అటువంటి పరిస్థితిని వృద్ధులు ఎలా అంగీకరిస్తారో మనం ఊహించలేము.. అది కూడా వినికిడి, కొన్ని నరాల సమస్యలను కలిగి ఉన్నవారు.
సీనియర్ సిటిజన్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాకు సహాయం చేసిన భారతీయ రైల్వేకి మా కుటుంబం నిజంగా కృతజ్ఞతలు తెలుపుతోంది. రైల్వే మంత్రి చేసిన ఇలాంటి సహాయం చాలా సార్లు విన్నాను. ఎంతో అద్భుతమైన భారతీయ రైల్వేలు, ఏఎన్ కృష్ణారెడ్డి లాంటి అధికారులను కలిగి ఉన్నందుకు భారతీయులు మనం ఎంత అదృష్టవంతులమో ఈసారి మేము అనుభవించాము.
(నిరూపమ కేఎస్- సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్, ఏషియానెట్ న్యూస్ కన్నడ)
