ఆఫీసుల నుండి పెన్నులు, పెన్సిల్లు, పిన్ స్టాండ్స్, పేపర్స్ ఇలాంటివి ఉద్యోగులు తీసుకెళ్లడం మామూలుగా జరుగుతూనే ఉంటుంది. కానీ రైల్వే శాఖలో పనిచేసే సదరు ప్రబుద్ధుడు.. రైలు కూడా మనసొంతమే అనుకున్నాడు. ఏకంగా రైల్వే ఇంజిన్ నే తీసుకెళ్లాలనుకున్నాడు. దానికోసం పక్కా ప్రణాళికతో స్కెచ్ వేశాడు. అన్నీ అనుకున్నట్టే జరిగాయి.. కాకపోతే చివర్లో ఓ ట్విస్ట్ జరిగింది. వివరాల్లోకి వెడితే.. 

చార్మినార్ ను, మక్కామసీదు ను, హైటెక్ సిటీని అమ్మేస్తానంటూ మోసం చేసే ఘరానా దొంగల గురించి సినిమాల్లో అనేక కామెడీ సీన్లు చూసి నవ్వుకుంటాం. ఇలా ఉంటారా? అనుకుంటాం. అయితే ఇది వాస్తవమేనని ఇలాంటి దొంగలు కూడా ఉంటారని నిరూపించాడో రైల్వే ఉద్యోగి. పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడు. ఏకంగా ఎవ్వరూ ఊహించని వస్తువునే అమ్మేయాలనుకున్నాడు.

ఆఫీసుల నుండి పెన్నులు, పెన్సిల్లు, పిన్ స్టాండ్స్, పేపర్స్ ఇలాంటివి ఉద్యోగులు తీసుకెళ్లడం మామూలుగా జరుగుతూనే ఉంటుంది. కానీ రైల్వే శాఖలో పనిచేసే సదరు ప్రబుద్ధుడు.. రైలు కూడా మనసొంతమే అనుకున్నాడు. ఏకంగా రైల్వే ఇంజిన్ నే తీసుకెళ్లాలనుకున్నాడు. దానికోసం పక్కా ప్రణాళికతో స్కెచ్ వేశాడు. అన్నీ అనుకున్నట్టే జరిగాయి.. కాకపోతే చివర్లో ఓ ట్విస్ట్ జరిగింది. వివరాల్లోకి వెడితే.. 

యూట్యూబ్ లో చూసి ఇంట్లోనే డెలివరీ చేసిన భర్త... శిశువు మృతి, భార్య పరిస్థితి విషమం

Department of Railwaysలో Engineer గా పని చేసే ఓ వ్యక్తి ఏకంగా train engine పైనే కన్నేశాడు. అతని కుటిల బుద్దికి... ఓ పోలీస్ ఇన్స్పెక్టర్, సహాయకుడు తోడయ్యారు. ఇంకేముంది గుట్టుచప్పుడు కాకుండా రైలు ఇంజన్ ను Old luggage కొనే మాఫియాకు అమ్మేశారు. బీహార్ లోని పుర్ణియా కోర్ట్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న సమస్తీపూర్ లోకో షెడ్ లో రాజీవ్ రంజన్ ఝా ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.

పుర్ణియా స్టేషన్ లో చిన్న రైల్వే ట్రాక్ పై తిరిగే ఓ పాత రైలు ఇంజన్ ఉంది. దానిని అమ్మేయాలని భావించిన ఝా Duplicate documents సృష్టించి.. అవి పై అధికారుల నుంచి వచ్చినట్లుగా నమ్మించాడు. ఆ తరువాత పాత సామాన్లు కొనుగోలు చేసే ఓ మాఫియాకు అమ్మేశాడు. ఈ వ్యవహారంలో స్థానికంగా పనిచేసే పోలీస్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర ద్వివేది, సహాయకుడు తోడ్పాటు అందించారు.

వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన ఎంపీలు.. ఆయన నిర్వహించిన వేడుకకు హాజరు

డిసెంబర్ 14న రాజీవ్.. హెల్పర్ సాయంతో గ్యాస్ కట్టర్ తో రైలు ఇంజిన్ ను ముక్కలు చేస్తూ కనిపించారు. అక్కడున్న కొంతమంది అధికారులు దానిని అడ్డుకోగా నకిలీ ధ్రువపత్రాలను చూపించాడు. అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు వారు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు తమ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని రాలేదని చెప్పారు. దీంతో ఆర్ పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు... తమదైన శైలిలో విచారణ చేపట్టగా నిజం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ వీరేంద్రతో పాటు వారికి సహకరించిన హెల్పర్ ను సస్పెండ్ చేశారు.