Asianet News TeluguAsianet News Telugu

ఒడిశా రైలు ప్రమాదం.. గల్లంతైన వారి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఒడిశా రైలు ప్రమాదంలో తప్పిపోయిన వారి విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎమోషనల్ అయ్యారు. గల్లంతైన వారందరినీ వారి కుటుంబ సభ్యులకు చేర్చడమే తన లక్ష్యమని అన్నారు. 

Railway Minister Ashwini Vaishnav became emotional while talking about Odisha train accident..ISR
Author
First Published Jun 5, 2023, 10:49 AM IST

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గల్లంతైన వారి గురించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. గల్లంతైన వారిని వీలైనంత త్వరగా వారి కుటుంబ సభ్యులతో తిరిగి కలపడమే తన లక్ష్యమని చెప్పారు. ‘‘ఇంకా మా బాధ్యత ముగియలేదు. గల్లంతైన వారిని త్వరగా కనుగొనాలి. వారిని వీలైనంత కుటుంబ సభ్యులతో కలపడమే మా లక్ష్యం’’ అని అశ్విని వైష్ణవ్ చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒడిశా రైలు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. 2022 ఆడిట్ రిపోర్టులోనే రైలు భద్రతపై తీవ్ర ఆందోళన లేవనెత్తిన కాగ్..

ఈ సందర్భంగా ప్రమాద బాధిత విభాగాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సమయంలో ఆయన వెంట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉన్నారు. ‘‘ఈ విభాగం నుంచి మూడు రైళ్లు బయలుదేరాయి (రెండు కిందకి, ఒకటి పైకి), మేము ఈ రాత్రి ఏడు గంటలకు నడపాలని ప్లాన్ చేశాము. ఈ ప్రవేశ విభాగాన్ని సాధారణ స్థితికి తీసుకెళ్లాలి.’’ అని అన్నారు.

ఒడిశాలో ప్రారంభమైన రాకపోకలు..
బాలాసోర్ లో ప్రమాదం జరిగిన సెక్షన్ లో మొదటి రైలు ఆదివారం రాత్రి 10.40 గంటలకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్న 51 గంటల తర్వాత మీడియా ప్రతినిధులు, రైల్వే అధికారులు, అశ్విని వైష్ణవ్ చూస్తుండగానే గూడ్స్ రైలు కదిలింది. ఈ దృష్యాలకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేస్తూ.. ‘‘డౌన్ లైన్ పునరుద్ధరణ పూర్తయింది. సెక్షన్ లో తొలి రైలు కదలిక’’ అని అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.

సీబీఐ విచారణ కోరిన రైల్వే శాఖ
బాలాసోర్ రైలు ప్రమాదానికి మూలకారణాన్ని, నేరపూరిత చర్య వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించామని అశ్విని వైష్ణవ్ చెప్పిన కొన్ని గంటల్లోనే రైల్వే శాఖ ఆదివారం బాలాసోర్ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ కోరింది. రైళ్ల ఉనికిని గుర్తించే ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను విధ్వంసం, ట్యాంపరింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదానికి కారణమైందని రైల్వే అధికారులు సూచించారు.

ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు, బీజేపీ మాజీ నేత అమీర్ రజా హుస్సేన్ కన్నుమూత.. ప్రముఖుల నివాళి..

కాగా.. ఈ ప్రమాదానికి కారణం ఎలక్ట్రిక్ పాయింట్ మెషిన్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ అని వైష్ణవ్ తెలిపారు. ‘‘పాయింట్ మెషీన్ సెట్టింగ్ ఎలా మార్చారు ? ఎందుకు చేశారనేది దర్యాప్తు నివేదికలో తేలుతుంది. ఈ భయానక ఘటనకు మూలకారణాన్ని గుర్తించాం. అయితే పూర్తి వివరాలు ఇప్పుడే వెల్లడించలేము. రిపోర్టు వచ్చిన తరువాతమే మిగితావి తెలుస్తాయి. నేరపూరిత చర్యకు మూలకారణాన్ని, బాధ్యులను గుర్తించామని మాత్రమే ఇప్పుడు చెబుతాం’’ అని ఆయన అన్నారు. కాగా.. మూడు రైలు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్యను ఒడిశా ప్రభుత్వం 288 నుంచి 275కు సవరించింది. ఇంకా 187 మృతదేహాలను గుర్తించాల్సి ఉండగా, వాటిని మృతుల బంధువులు క్లెయిమ్ చేసుకునే వరకు ఉంచడం స్థానిక యంత్రాంగానికి సవాలుగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios