Asianet News TeluguAsianet News Telugu

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్..

రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్‌ బోనస్‌(పీఎల్‌బీ) 78రోజులకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ బుధవారం వెల్లడించారు.

Railway Employees Likely To Get Around 18,000 Rupees As Bonus Before Dussehra
Author
Hyderabad, First Published Oct 10, 2018, 3:17 PM IST

దసరా పండగ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది  దసరా బోనస్ గా రైల్వే ఉద్యోగులకు 78 రోజల పనివేతనం ఇవ్వనున్నట్లు తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్‌ బోనస్‌(పీఎల్‌బీ) 78రోజులకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ బుధవారం వెల్లడించారు. నాన్‌ గెజిట్‌ రైల్వే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్‌ లభించనుంది. దీని కింద ఉద్యోగులు తమ వేతనంతో పాటు సుమారు రూ.18వేలు అదనంగా బోనస్‌ కింద పొందనున్నారు.

పీఎల్‌బీ బోనస్‌ కింద సుమారు 12.26లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎస్‌ఎఫ్‌) ఉద్యోగులకు ఇది వర్తించదు. ఈ బోనస్‌ వల్ల దాదాపు రూ.2వేల కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుంది. గత ఆరేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దసరా సందర్భంగా 78రోజుల పీఎల్‌బీని బోనస్‌గా ఇస్తూ వస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios