మహారాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్ నిరసన: లోక్‌సభలో రాహుల్, బయట సోనియా

మహారాష్ట్రలో చోటు చేసుకొన్న పరిణామాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది.ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు  సోమవారం మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.

Rahul, Sonia Decry 'Murder of Democracy' in Maha, Both Houses Adjourned Amid Protests by Cong MPs

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో చోటు చేసుకొన్న పరిణామాలపై లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర పరిణామలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తావించారు. మరో వైపు పార్లమెంట్ బయట కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ నేతృత్వంలో  ధర్నాకు పూనుకొన్నారు. 

 మహారాష్ట్రలో  బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ నిరసనకు దిగింది.  మహారాష్ట్రలో చోటు చేసుకొన్న పరిణామాలపై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో  కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో  గందరగోళం నెలకొంది.

మహారాష్ట్రలో  బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని   రాహుల్ గాందీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల ఆందోళనకు ఇతర పార్టీలు కూడ మద్దతుగా నిలిచారు.

మహారాష్ట్ర  పరిణామాలపై  కాంగ్రెస్ పట్టుబట్టడడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో పార్లమెంట్‌లో నిరసనకు దిగారు. 

Also read:డిప్యూటీ సీఎంగా అజిత్ పవర్! .. ఆయన ట్విట్టర్‌ను చూసి షాక్ అవుతున్న నెటిజన్స్

ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి  సహకరించాలని  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా కోరారు. స్పీకర్ పదే పదే విన్నవించినా కూడ ఫలితం లేకుండా పోయింది.ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 స్పీకర్ పలుమార్లు విన్నవించినా కూడ ఫలితం లేకపోయింది. పార్లమెంట్  ఆర్డర్‌లోకి రాలేదు. దీంతో  స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను వాయిదా వేశారు. రాజ్యసభలో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ కూడ మధ్యాహ్నానికి వాయిదా పడింది.ఇదే సమయంలో సుప్రీంకోర్టులో  మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై  విచారణ సాగింది.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios