డిప్యూటీ సీఎంగా అజిత్ పవర్! .. ఆయన ట్విట్టర్‌ను చూసి షాక్ అవుతున్న నెటిజన్స్

వరుస ట్వీట్లలో తనకు శుభాకాంక్షలు చెప్పిన బీజేపీ నేతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అజిత్ పవార్ వరుస ట్వీట్లు చేసాడు.

ajit pavaar thanks bjp leaders ina series of tweets

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఎటువైపు పయనిస్తున్నాయి అర్థమవ్వడంలేదు. ఎన్సీపీ రెబెల్ నేత అజిత్ పవార్ ను వెనక్కి తీసుకొచ్చేందుకు ఎన్సీపీ అధినాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. నిన్నటినుండి సీనియర్ నేత సునీల్ తట్కరే ఈ విషయమై రాయబారం నెరుపుతున్న మిగిలిన ఎమ్మెల్యేలు వెనక్కి వచ్చారు తప్ప అజిత్ పవార్ మాత్రం రాలేదు. 

నేటి ఉదయం సీనియర్ ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ అజిత్ పవార్ తో చర్చలు జరపడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. కాకపోతే అజిత్ పవార్ ని చేరుకోవాదం కష్టంగా మారిందని అంటున్నారు. ఎన్సీపీ నేతలు మాత్రం అజిత్ పవార్ వెనక్కి వస్తాడని చెబుతున్నా, అతను మాత్రం బీజేపీకి దగ్గరగానే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. 

కొద్దీ సేపటికింద వరుస ట్వీట్లలో తనకు శుభాకాంక్షలు చెప్పిన బీజేపీ నేతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అజిత్ పవార్ వరుస ట్వీట్లు చేసాడు. అక్కడితో ఆగకుండా తన ట్విట్టర్ బయో ను కూడా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మార్చాడు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఇప్పటికి తనను తాను ఎన్సీపీ నాయకుడిగానే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలు ఎటువైపు తిరుగుతున్నాయి ఇప్పుడు మాత్రం చెప్పడం కష్టంగా మారింది. 

 

 

 

నిన్నటినుండి అనేక ప్రయత్నాలు చేసి అజిత్ పవార్ వెంట నడిచిన చాలా మంది ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకురావడంలో విజయవంతమయ్యారు ఎంసీపీ నాయకులు. అజిత్ పవార్ అత్యంత ఆప్తుడైన ధనంజయ్ ముండే ఎన్సీపీ పార్టీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటుకు సూత్రధారైన గోపినాథ్ తిరిగి రావడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. 

ముంబై నుండి ఢిల్లీ తరలించడానికి సిద్ధంగా ఉన్న రెబెల్ ఎన్సీపీ ఎమ్మెల్యేలైన  దౌలత్ ధరోడా, నరహరి జిర్వార్, సునీల్ భుసారా , దిలీప్ బంకర్, అనిల్ భాయ్ దాస్ పాటిల్, నితిన్ పవార్, సునీల్ శెలకే, బాబా సాహెబ్ పాటిల్, సంజయ్ బన్సన్ ల నుంచి ఇద్దరు తిరిగి శరద్ పవార్ వద్ద చేరారు.  సునీల్ శెలకే, సునీల్ భుసారాలు తిరిగి శరద్ పవార్ క్యాంపులో చేరిపోయారు. 

ఒక్క క్షణం ఒకదగ్గర కనపడ్డ వ్యక్తి మరు నిమిషం ఎక్కడ ప్రత్యక్షమవుతాడో అర్థం కాకుండా ఉంది. ప్రస్తుతం గనుక చూసుకుంటే, 5గురు ఎమ్మెల్యేలు మాత్రమే అజిత్ పవార్ కి మద్దతు ఇస్తున్నట్టు సమాచారం అందుతుంది. 

అజిత్ పవార్ కి మద్దతిచ్చేందుకు ఎవరి ఇంట్లో అయితే ఈ రెబెల్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారో, ఆ ఎమ్మెల్యే ధనంజయ్ ముండే ఇప్పుడు తిరిగి శరద్ పవార్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. 

ఎన్సీపీ రెబెల్ ఎమ్మెల్యేలతోని ఇప్పటికే ఎన్సీపీ సీనియర్లు చర్చలు జరుపుతున్నాయి. శరద్ పవార్ కూడా స్వయంగా అజిత్ పవార్ ని కూడా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios