రాహుల్ కారణంగా.. మా భార్యలు మమ్మల్ని వదిలేసేలా ఉన్నారు

Rahul should get married then he can hug us: BJP MP Nishikant Dubey
Highlights

ఇటీవల పార్లమెంట్ లో రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీని హగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది పెద్ద దుమారమేరేపింది.
కాగా.. దీనిపై ఇటీవల రాహుల్ మాట్లాడుతూ.. తనని చూస్తే ఎక్కడ కౌగిలించుకుంటానో అని భయంతో బీజేపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారణంగా తమ భార్యలు తమను వదిలిసే పరిస్థితులు వచ్చాయని బీజేపీ నేత నిశికాంత దుబే అభిప్రాయపడ్డారు. ఇంతకీ మ్యాటరేంటంటే..  ఇటీవల పార్లమెంట్ లో రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీని హగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది పెద్ద దుమారమేరేపింది.
కాగా.. దీనిపై ఇటీవల రాహుల్ మాట్లాడుతూ.. తనని చూస్తే ఎక్కడ కౌగిలించుకుంటానో అని భయంతో బీజేపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారు.

అయితే.. వీటిపై బీజేపీ ఎంపీ నిశికాంత దుబే స్పందించారు. ‘మేం ఆయన్ని ఎందుకు కౌలిగించుకోవాలి?. పైగా స్వలింగసంపర్కానికి సంబంధించి సెక్షన్‌ 377ను ఇంకా రద్దు కాలేదు కదా. ఈ సమయంలో రాహుల్‌ను కౌగిలించుకుంటే మా భార్యలు మాకు ఖచ్ఛితంగా విడాకులు ఇస్తారు. అయితే రాహుల్‌కి ఓ సలహా. ఆయన గనుక ముందు వివాహం చేసుకుంటే మంచిది. అప్పుడు నిరభ్యరంతంగా కౌగిలించుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. అయితే దుబే చేసిన ‘తేడా వ్యాఖ్యల’పై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

loader