Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీకి భద్రతా లోపం.. 15 నిమిషాలపాటు సెక్యూరిటీ మాయం!.. భారత్ జోడో పాదయాత్ర ఆపేసిన రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు కశ్మీర్‌లోకి అడుగు పెట్టగానే పోలీసులు మటుమాయం అయ్యారని, భద్రతా లోపం ఏర్పడిందని కాంగ్రెస్ వాదిస్తున్నది. కనీసం 15 నిమిషాలపాటు భారత్ జోడో యాత్రకు సెక్యూరిటీ లేకుండా పోయిందని వివరించింది.
 

rahul gandhis bharat jodo yatra cancelled after very serious security lapse
Author
First Published Jan 27, 2023, 11:29 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఈ రోజు భద్రతా లోపం ఏర్పడినట్టు పార్టీ నేతలు తెలిపారు. జమ్మ కశ్మీర్‌లో తమకు తీవ్రమైన భద్రతా లోపం ఎదురైందని అన్నారు. పాదయాత్ర జమ్ము నుంచి కశ్మీర్ లోయలోకి ఎంటర్ అవ్వగానే ఈ సెక్యూరిటీ ల్యాప్స్ కనిపించిందని వివరించారు. దీంతో రాహుల్ గాంధీ ఈ రోజుకి తన పాదయాత్రను అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చిందని తెలిపారు.

కశ్మీర్‌లో రాహుల్ గాంధీ ఈ రోజు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాల్సింది. కానీ, ఒక్క కిలోమీటర్ మాత్రమే నడిచారు. ఈ రోజు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు.

రాహుల్ గాంధీ బనిహాల్ టన్నెల్ దాటి శ్రీనగర్ వైపు వెళ్లుతున్నాడు. కొద్ది దూరంలో ఈ యాత్రలో పాల్గొనడానికి పెద్ద మొత్తంలో ప్రజలు గుమిగూడారు. కానీ, అప్పుడే ఈ సముదాయాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు సెక్యూరిటీ బృందాలు కనిపించకుండా పోయాయని రాహుల్ గాంధీ ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. తాము ఆ టన్నెల్ నుంచి బయటక రాగానే అసలు తమకు పొలీసు సెక్యూరిటీ అన్నదే లేకుండా పోయిందని వివరించారు. దీంతో తన సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పడ్డారు.. ఫలితంగా తాను ఈ యాత్ర ఈ రోజుకు అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చిందని వివరించారు. తన సెక్యూరిటీ సిబ్బంది సలహాలకు భిన్నంగా తాను నిర్ణయం తీసుకోలేనని తెలిపారు. ఇది జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ తప్పే అని వాదించారు.

Also Read: సర్జికల్ స్ట్రైక్ ఆధారాలేవి అని ప్రశ్నించిన దిగ్విజయ్ సింగ్.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?

ఇందుకు తానే సాక్ష్యం అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.జమ్ము కశ్మీర్ పోలీసులు మెయింటెయిన్ చేయాల్సిన ఔటర్ రింగ్ కార్డన్ మొత్తంగా కనిపించకుండా పోయింది. జమ్ము నుంచి తాము అప్పుడే కశ్మీర్‌లో అడుగుపెట్టామని, 11 కిలోమీటర్ల పాదయాత్రను దురదృష్టవశాత్తు రద్దు చేయాల్సి వచ్చిందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. 

రాహుల్ గాంధీ ఆ ప్రజల మూకుమ్మడి ఒత్తిడిలో కనీసం 30 నిమిషాలు ఎక్కడికి కదల్లేకపోయాడని కాంగ్రెస్ పేర్కొంది. అనంతరం, తనను బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌లో తీసుకుని ఈ రోజుకు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. 

బనిహల్ టన్నెల్ దాటగానే ఏదైనా పోలీసులు వెనక్కి పోయారని, ఇలా చేయాలని ఎవరు ఆదేశించార? అని కాంగ్రెస్ లీడర్ కేసీ వేణుగోపాల్ అడిగారు. కనీసం 15 నిమిషాల పాటు రాహుల్ గాంధీకి అక్కడ అసలు సెక్యూరిటే లేదని వివరించారు. ఇది చాలా తీవ్రమైన భద్రతా లోపం అని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios