మోదీకి షాక్.. రాహుల్ పై శివసేన ప్రసంశల వర్షం

Rahul Gandhi, you stole the show: Shiv Sena on Congress chief hugging PM Modi
Highlights

 తన ప్రసంగాన్ని ముగించిన రాహుల్ గాంధీ.. వెంటనే ప్రధాని నరేంద్రమోదీ కుర్చీ వద్దకు వెళ్లి.. ఆయనను హగ్ చేసుకున్నారు. ఈ హఠాత్ పరిణామానికి మోదీ సహా.. సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు.
 

కేంద్రంలోని అధికార పార్టీకి బీజేపీ మిత్రపక్షమైన శివసేన.. ప్రధాని నరేంద్రమోదీకి షాకిచ్చింది. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. 

ఇంతకీ మ్యాటరేంటంటే.. శుక్రవారం పార్లమెంట్ లో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ పాలనపై  రాహుల్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పలు విమర్శల అనంతరం తన ప్రసంగాన్ని ముగించిన రాహుల్ గాంధీ.. వెంటనే ప్రధాని నరేంద్రమోదీ కుర్చీ వద్దకు వెళ్లి.. ఆయనను హగ్ చేసుకున్నారు. ఈ హఠాత్ పరిణామానికి మోదీ సహా.. సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు.

అయితే.. ఈ ఘటన అనంతరం రాహుల్ హగ్, కన్నుగీటడం పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. అవిశ్వాస తీర్మానం లాంటి సీరియస్ విషయాన్ని పక్కన పెట్టేసి.. మీడియా సైతం రాహుల్ గాంధీ చేసిన దానిమీదే ఎక్కువ కథనాలు ప్రచురించింది. కాగా ఇదే విషయంపై శివసేన తన పత్రిక ‘ సామనా’ లో గాంధీపై ప్రశంసల వర్షం కురిపించింది.

నిన్న పార్లమెంట్ లో జరిగిన టోటల్ ఎపిసోడ్ లో రాహుల్ గాంధీనే స్పెషల్ ఎట్రాక్షన్ అని, టోటల్ షోని రాహుల్ స్టీల్ చేశాడంటూ ఆ పత్రికలో పేర్కొన్నారు. రాహుల్ చేసిన పనికి.. చాలా మంది ఆయనకు అభిమానులుగా మారారని అందులో పేర్కొనడం గమనార్హం. అయితే.. రాహుల్ మోదీని హగ్ చేసుకోవడంపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. చివరకు స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 

loader