Asianet News TeluguAsianet News Telugu

‘‘జంతర్‌ మంతర్‌ ఛూమంతర్‌ కాళీ’’.. మోడీకి హగ్.. నెలల ముందే రాహుల్ ప్లాన్

వందల మంది సభ్యుల ముందు ప్రధాని మోడీని కౌగిలించుకుని సంచలనం సృష్టించారు యువనేత. ఆయన మోడీని కౌగిలించుకోవాలని అప్పటికప్పుడు అనుకోలేదట. దీని కోసం నెలల తరబడి రాహుల్ నిరీక్షించాడంటూ కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Rahul Gandhi Waited Months hug to modi

తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా అప్పటి వరకు ప్రధాని మోడీ పనితీరుపైనా, బీజేపీపైనా విమర్శలు గుప్పించి.. పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా రాహుల్ మారిపోయారని కాంగ్రెస్ అభిమానులు, జనం అనుకునేలోపే. వందల మంది సభ్యుల ముందు ప్రధాని మోడీని కౌగిలించుకుని సంచలనం సృష్టించారు యువనేత. 

పార్లమెంట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని అరుదైన ఘటనకు పార్లమెంటరేయన్లు ఉలిక్కిపడ్డారు. ఆయన ప్రవర్తనపై లోక్‌సభ స్పీకర్, సీనియర్ పార్లమెంట్ సభ్యులు అభ్యంతరం తెలిపినా.. సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలినా.. రాహుల్ మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయారు. తన చర్యను సమర్థించుకున్నారు. ఆయన మోడీని కౌగిలించుకోవాలని అప్పటికప్పుడు అనుకోలేదట. దీని కోసం నెలల తరబడి రాహుల్ నిరీక్షించాడంటూ కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

ఇందుకు ఒక సందర్భాన్ని సైతం వారు వివరిస్తున్నారు.. కొద్ది నెలల క్రితం ఒక బహిరంగసభలో ప్రసంగించిన ప్రధాని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియాలపై విమర్శలు చేశారు. ఆ సమయంలో మోడీకి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించిన రాహుల్.. వాదనలకు, ఎదురుదాడికి దిగకుండా ‘చూ మంత్రకాలిని’ ఎంచుకుని.. హగ్ ఇవ్వాలనుకున్నారని తెలుస్తోంది.. అయితే అందుకు సరైన సమయం దొరకకపోవడంతో కొద్దినెలల పాటు ఎదురుచూశాడు.. 

సరిగ్గా అవిశ్వాసం సందర్భంగా ఆ అవకాశం దొరికింది. బీజేపీ పనితీరును తూర్పారబట్టిన రాహుల్ గాంధీ అనంతరం తను అనుకున్న  ప్లాన్ ప్రకారం మోడీ స్థానం వద్దకు వెళ్ళి... ఆయనకు హగ్ ఇచ్చాడు. ఈ చర్య కారణంగా వివిధ వర్గాల నుంచి కాంగ్రెస్  అధ్యక్షుడు విమర్శలు ఎదుర్కొన్నారు. సభ గౌరవాన్ని సభ్యులే కాపాడాలని.. రాహుల్ ఇలా చేసి ఉండకూడదని స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అవిశ్వాసం రోజున రాత్రి 10 గంటల నుంచి 12 గంటల మధ్య ట్వీట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగినట్లు ట్వీట్టర్ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios