మిజోరాంలో స్కూటర్ పై పర్యటించిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం మిజోరాం పర్యటన సందర్భంగా ఐజ్వాల్‌లో టూ వీలర్ పై లిఫ్ట్ తీసుకుని వెళ్ళారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
మిజోరాం : ప్రజల్లో కలిసిపోవడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన దైన స్టైల్ ను ఎంచుకున్నారు. తాను వెడుతున్న దారిలో ఏదైనా సహాయం కావాల్సినవారు కనిపిస్తే.. వెంటనే ఆగడం.. సాయపడడం.. తన ప్రయాణం కోసం అనేక రకాల ప్రజారవాణాలను ఎంచుకోవడం ఇలాంటివి ఇప్పటికే వైరల్ అయ్యాయి.
మిజోరాం కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ రాహుల్ గాంధీ స్కూటర్‌పై ఉన్న ఫొటోలను షేర్ చేసింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన కోసం మిజోరంకు వచ్చారు. రాహుల్ గాంధీ సోమవారం ఐజ్వాల్‌లో చన్మారి జంక్షన్ నుండి రాజ్ భవన్ వరకు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. 40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి.
దారుణం.. నిద్రపోనివ్వకుండా ఏడుస్తుందని.. రెండేళ్ల చిన్నారిని గొంతునులిమి చంపేసిన పిన్ని...
తన్హావ్లా నివాసానికి చేరుకోవడానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ టూ వీలర్ పై పిలియన్ రైడ్ చేశారు. అంతకుముందు చన్మారి (ఐజ్వాల్) నుండి రాజ్ భవన్ వరకు పాదయాత్రలో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "భారత్ జోడో యాత్రతో దేశం ఏం ఆలోచిస్తుందో తెలిసింది. మన దేశంలోని విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు గౌరవించబడతాయి, రక్షించబడతాయి. మణిపూర్‌లో బీజేపీ ఆ ఆలోచనను నాశనం చేసింది. మిజోరంలో కూడా అలా చేయడానికి మేం వారిని అనుమతించం.
మిజోరంలో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కోసం 39 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం మిజో నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి జోరమ్‌తంగా చేతిలో ఉన్న ఐజ్వాల్ ఈస్ట్-I నియోజకవర్గం నుండి కాంగ్రెస్ లాల్సంగ్లూరా రాల్టేను పోటీకి దింపింది. ఐజ్వాల్ వెస్ట్-3 (ఎస్టీ) నుంచి మిజోరాం కాంగ్రెస్ కమిటీ చీఫ్ లాల్సవ్తా పోటీ చేయగా, ఐజ్వాల్ నార్త్-1 (ఎస్టీ) నుంచి లాల్నున్మావియా చువాంగోకు పార్టీ టికెట్ ఇచ్చారు.
40 మంది సభ్యుల మిజోరాం అసెంబ్లీలో, మిజో నేషనల్ ఫ్రంట్ 37.8% ఓట్లతో 26 స్థానాలను కైవసం చేసుకుని 2018 ఎన్నికలలో విజయం సాధించింది. కాంగ్రెస్ ఐదు స్థానాలు, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందాయి. నవంబర్ 7న మిజోరం, నవంబర్ 7, 17న ఛత్తీస్‌గఢ్, నవంబర్ 17న మధ్యప్రదేశ్, 25న రాజస్థాన్, 30న తెలంగాణ, అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.
ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల తేదీల ప్రకటనతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు నెలరోజుల ముందు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి.