Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. నిద్రపోనివ్వకుండా ఏడుస్తుందని.. రెండేళ్ల చిన్నారిని గొంతునులిమి చంపేసిన పిన్ని...

గుక్కపట్టి ఏడుస్తోందని.. నిద్రపోనివ్వడం లేదని ఓ పిన్ని రెండేళ్ల చిన్నారిని దారుణంగా గొంతునులిచి చంపేసింది. 

Aunt strangulated two-year-old girl for crying in Madhya Pradesh - bsb
Author
First Published Oct 18, 2023, 6:45 AM IST

మధ్యప్రదేశ్ : చిన్నారుల అల్లరి కొన్నిసార్లు విసుగు తెప్పించినా, ముద్దుగా ఉంటుంది. వచ్చీరాని మాటలతో వారు చేసే అల్లరి ఒక్కోసారి శృతిమించుతుంటుంది. అప్పుడు ఇంట్లోని పెద్దలు నయానో, భయానో వారిని కంట్రోల్ చేస్తుంటారు. ఆ తర్వాత అంతే ప్రేమతో చిన్నారులను దగ్గరికి తీసుకుంటారు. కానీ, దీనికి భిన్నమైన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారిని ఆమె సొంత పిన్ని గుక్క పట్టి ఏడుస్తుందన్న కారణంతో గొంతు నులిమి చంపేసింది.

ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన  వివరాలలోకి వెళితే..  మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో మహమ్మద్ షకిల్ అనే వ్యక్తి ఉంటున్నాడు. అతను, అతని సోదరుడు ఇద్దరు ఒకే ఇంట్లో కాపురం ఉంటారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. షకీల్ కు రెండేళ్ల వయసున్న కుమార్తె ఉంది. ఆ చిన్నారి సోమవారం నాడు ఆడుకుంటూ తన పిన్ని గదిలోకి వెళ్ళింది.

Same Sex Marriage: వివాహాన్ని కోర్టులు నిర్ణయించవు.. సుప్రీం తీర్పుపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు..

కాసేపు అక్కడే ఆడుకున్న తర్వాత ఆమె పిన్ని.. తనకు నిద్ర వస్తుంది తల్లి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. కానీ దీనికి చిన్నారి ఒప్పుకోలేదు. తాను ఇక్కడే ఉంటానంటూ మారాం చేసింది. ఎంత చెప్పినా వినకపోవడంతో కోపానికి వచ్చిన ఆ పిన్ని చిన్నారిని చెంప దెబ్బ కొట్టింది. వెంటనే పెద్దపెట్టున గుక్క పట్టి ఏడవడం మొదలుపెట్టింది చిన్నారి. దీంతో తీవ్ర అగ్రహావేషాలకు లోనైన చిన్నారి పిన్ని బాలిక గొంతు నులిమింది. అక్కడికక్కడే బాలిక చనిపోయింది.

ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని సోఫా కింద దాచి పెట్టింది.  కాసేపటి తర్వాత చిన్నారి కోసం పాప తల్లి వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో.. అంతటా గాలించిన తల్లిదండ్రులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఇంట్లో ఉన్న చిన్నారి ఎలా కనిపించకుండా పోతుంది? అనే సందేహంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. కాగా, చిన్నారి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఆనవాళ్లు అందులో కనిపించలేదు. ఇంట్లోనే ఎక్కడో దాక్కునే ఉంటుందని వెతకగా సోఫా కింద చిన్నారి మృతదేహం వెలుగు చూసింది.

Follow Us:
Download App:
  • android
  • ios