ఐఐటీ-మద్రాస్ లో పీహెచ్ డీ విద్యార్థి ఆత్మహత్య.. చనిపోయేముందు వాట్సాప్ స్టేటస్ ఏంటంటే...

తన గదిలో ఉరివేసుకుని కనిపించడానికి కొన్ని గంటల ముందు, ఐఐటీ విద్యార్థి "సారీ, నేను దీనికి సరిపోను" అని వాట్సాప్ స్టేటస్‌ను పోస్ట్ చేసాడు.

PhD student commits suicide in IIT-Madras - bsb

చెన్నై : మద్రాస్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఓ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఏడాది ఇలా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఇది మూడోది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 32 ఏళ్ల ఈ విద్యార్థి ఐఐటిలో పిహెచ్‌డి చేస్తున్నాడని పోలీసులు ఈరోజు తెలిపారు. అతను తన గదిలో ఉరివేసుకుని కనిపించాడు. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు, అతను "సారీ, నేను దీనికి సరిపోను" అని వాట్సాప్ స్టేటస్‌ను పోస్ట్ చేసాడు. 

ఆ స్టేటస్ చూసిన అతని స్నేహితులు అనుమానంతో అతని ఇంటికి చేరుకున్నారు. వారు వచ్చేసరికే సచిన్ అనే ఆ విద్యార్థి గదిలో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే స్నేహితులు అంబులెన్స్‌కు కాల్ చేశారు. అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది పరీక్షించగా అతను అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించబడింది" అని పోలీసులు తెలిపారు.

నమ్మిన వారికి రూ .40 కోట్ల టోకరా వేసిన పోలీస్ బ్రదర్స్.. ఆన్ లైన్ వ్యాపారం పేరుతో మోసం...

దీనిమీద ఐఐటీ మద్రాస్ ఒక ప్రకటన చేస్తూ చనిపోయిన రీసెర్చ్ స్కాలర్ కు మంచి అకడమిక్ విద్యా రికార్డు ఉందని పేర్కొంది. "మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పిహెచ్‌డి రీసెర్చ్ స్కాలర్ 31 మార్చి 2023 మధ్యాహ్నం చెన్నైలోని వేలచేరిలోని అతని నివాసంలో అకాల మరణం చెందడం మాకు చాలా బాధ కలిగించింది. చదువులో, పరిశోధనలో మంచి రికార్డు కలిగిన విద్యార్థి మరణం పరిశోధన సంఘానికి పెద్ద నష్టం" అని ఐఐటీ తెలిపింది.

‘విద్యార్థి మృతి పట్ల అతనికి, అతని కుటుంబానికి సంస్థ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది. మరణించిన విద్యార్థి స్నేహితులు, కుటుంబ సభ్యుల దుఃఖాన్ని పంచుకుంటుంది. ఈ క్లిష్ట సమయంలో విద్యార్థి కుటుంబం గోప్యతను గౌరవించాలని సంస్థ ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తోంది. మరణించిన విద్యార్థి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను"...అని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలోని ఐఐటీ క్యాంపస్‌లో బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థి, రీసెర్చ్‌ స్కాలర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios