గాంధీ ఫ్యామిలీలోకి న్యూ క్యూట్ మెంబర్ ఎంట్రీ.. సోనియాను సర్ ప్రైజ్ చేసిన రాహుల్..
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంట్లోకి న్యూ మెంబర్ ఏంట్రీ ఇచ్చింది. ఈ న్యూ మెంబరే ఒక కుక్కపిల్ల.. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన కుక్కపిల్లని బహుమతిగా ఇచ్చారు.

Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంట్లోకి న్యూ మెంబర్ వచ్చింది. ఈ న్యూ మెంబర్ ఏంట్రీకి కారణం రాహుల్ గాంధీనే. రాహుల్ గాంధీ సడెన్ గా ఓ కొత్త మెంబర్ ని తీసుకవచ్చి.. తన తల్లి సోనియా గాంధీని సర్ ప్రైజ్ చేశారు. ఈ సర్ ప్రైజ్ కు సోనియా గాంధీ తొలుత షాక్ అయింది. ఆ తర్వాత దానిని ఎంతో సాదారంగా స్వీకరించింది. ఇప్పుడూ దానిని ఎంతో ప్రేమను కురిపిస్తోంది. ఇంతకీ ఆ సర్ ప్రైజ్ గిప్ట్ ఏంటీ? ఆ న్యూ మెంబర్ ఎవరు? అని అనుకుంటున్నారా ? ఆ సర్ ప్రైజ్ గిప్టే ఒక కుక్కపిల్ల.. అవునండీ కుక్క పిల్లనే..
ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఓ క్యూట్ కుక్కపిల్లని బహుమతిగా ఇచ్చారు. దీనికి నూరి అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోలను, వీడియోలను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన కుటుంబంలో నూరిని సరికొత్త సభ్యుడిగా అభివర్ణించారు. ఈ కుక్క పిల్లను రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ కోసం గోవా నుంచి తీసుకవచ్చారట.
రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోలో .. మీరంతా మా కుటుంబానికి అత్యంత ప్రియమైన, సరికొత్త సభ్యురాలు నూరిని కలవాలని కోరుకుంటున్నాను. గోవా నుండి నేరుగా మా చేతుల్లోకి వచ్చి మా జీవితాలకు వెలుగుగా మారింది. షరతులు లేని ప్రేమ, విధేయత - ఈ అందమైన జంతువు మనకు చాలా నేర్పుతుంది! అని రాహుల్ పేర్కొన్నారు. సకల జీవరాశులను రక్షిస్తామని, వాటితో మన ప్రేమను పంచుకుంటామని ప్రతిజ్ఞ చేద్దామని అన్నారు.
రాహుల్ గాంధీ ఆగస్టు నెలలో గోవా లో పర్యటించినట్టు తెలుస్తోంది. ఈ ట్రిప్ కు సంబంధించిన వీడియోలో రాహుల్ గాంధీ గోవాలో రెండు మూడు కుక్క పిల్లలతో ఆడుకోవడం, ఆ తర్వాత ఒక కుక్క పిల్లను ఢిల్లీకి తీసుకురావడం చూడవచ్చు. రాహుల్ గాంధీ ఆ కుక్క పిల్లను బుట్టలో ఉంచి తన తల్లి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చారు. సోనియాగాంధీ నూరి(కుక్క పిల్ల)ని ఎత్తుకుని చాలా క్యూట్ గా ఉందని చెప్పింది. ఈ అందమైన బహుమతికి సోనియా.. రాహుల్ గాంధీకి ధన్యవాదాలు కూడా తెలిపారు.