Asianet News TeluguAsianet News Telugu

రాజ‌స్థాన్ ద‌ళిత విద్యార్థి మృతి ఘ‌ట‌న‌పై రాహుల్ గాంధీ మౌనమెందుకో - బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి వై స‌త్య కుమార్

రాజస్థాన్ లో టీచర్ దాడిలో దళిత విద్యార్థి చనిపోయారని అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారని బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి వై స‌త్య కుమార్ అన్నారు. దేశంలోని ప్రతీ అంశంపై మాట్లాడే ఆయన ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 

Rahul Gandhi should remain silent on Rajasthan Dalit student's death - BJP National Secretary Y Satya Kumar
Author
First Published Aug 14, 2022, 3:00 PM IST

రాజ‌స్థాన్ లో ఓ ద‌ళిత విద్యార్థి నీటి కుండ‌ను తాకాడాని టీచ‌ర్ చిత‌క‌బాదాడు. దీంతో ఆ పిల్లాడు హాస్పిటల్ చికిత్స పొందుతూ చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై బీజేపీ అధికార కాంగ్రెస్ పై విరుచుకుప‌డింది. కాంగ్రెస్ పాలనలో విద్యాల‌యం కుల వివక్ష, దౌర్జన్యార్జలకు కేంద్రంగా మారిందని ఆరోపించింది. ఆ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి వై స‌త్య కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘ‌ట‌న సిగ్గుచేట‌ని అన్నారు. రాష్ట్రంలో దళితులపై అఘాయిత్యాలు నిరంతరం పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అయితే దేశంలోని ప్రతి అంశంపై వ్యాఖ్యానించే రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు.

జేడీయూ, ఆర్జేడీ కూటమి జాతీయ రాజకీయాలపై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌దు - ప్రశాంత్ కిషోర్

ఇదే అంశంపై రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ మాట్లాడారు. ఒక వ్యక్తి అడ్మినిస్ట్రేష‌న్ కు భ‌య‌ప‌డ‌న‌ప్పుడు ఇలాంటి చ‌ర్య‌ల‌కే పాల్ప‌డుతాడ‌ని అన్నారు. రాష్ట్రంలో జ‌రిగే లెక్కలేనన్ని ఘటనలు సీఎం, హోంమంత్రి నిస్సహాయులని తెలియజేస్తున్నాయ‌ని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఈ ఘటన రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో జూలై 20వ తేదీన చోటుచేసుకుంది. 9 ఏళ్ల విద్యార్థి కుండలోని నీరు తాగేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో ఆ స్కూల్ టీచ‌ర్ చైల్ సింగ్ (40)ని తీవ్రంగా కొట్టాడు. దీంతో అత‌డి చెవిలోని సిర ప‌గిలిపోయింది. దీంతో వెంట‌నే ఆ పిల్లాడిని చికిత్స కోసం ఉదయ్ పూర్ కు తీసుకెళ్లారు. అక్క‌డి నుంచి మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్ కు పంపించారు. కాగా అప్ప‌టి నుంచి అక్క‌డే చికిత్స పొందుతున్న బాలుడు శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల‌కు ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించాడు.

మరోసారి చర్చకు నెహ్రూ.. విభజన వీడియోతో బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్ కౌంటర్

ఈ ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. నిందితుడి చైల్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. హ‌త్య‌,  ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం సెక్షన్ల కింద కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇది బాధాక‌ర‌మని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. ‘‘ జాలోర్‌లోని సైలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడి దాడి కారణంగా విద్యార్థి మృతి చెందడం బాధాకరం. నిందితుడిపై హత్య, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.’’ అని తెలిపారు. బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మృతుల బంధువులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల చొప్పున అందజేయనున్నారు.

ఈ ఘటనపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ శనివారం జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్‌కు లేఖ రాశారు. అయితే దీనిపై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు కమిషన్‌ చైర్మన్‌ తెలిపారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios