కుటుంబ పాలన కామెంట్లపై బీజేపీకి రాహుల్ గాంధీ చెక్.. ఏమన్నాడంటే?
కుటుంబ పాలన అంటూ బీజేపీ చేసే విమర్శలను రాహుల్ గాంధీ సమర్థంగా తిప్పికొట్టారు. బీజేపీ చేసే ఈ కామెంట్లకు ఆయన చెక్ పెట్టారు. అసలు బీజేపీ నాయకుల తనయులు ఏం చేస్తున్నారో ఒకసారి మనస్సాక్షిగా ఆలోచించండి అంటూ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, అగ్రనేత, వయానాడ్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ నుంచి తరచూ ఎదుర్కొనే కఠిన విమర్శ కుటుంబ పాలన, వారసత్వ పాలన వంటివే. ఒక దశలో రాహుల్ గాంధీ కూడా కుటుంబ పాలన దేశానికి సమస్యే అని గుర్తించారు కూడా. ఇప్పటికీ బీజేపీ పార్టీ కుటుంబ పాలన కామెంట్‌తో రాహుల్ గాంధీని ఇరకాటంలో పడేస్తుంది. అయితే.. తాజాగా, రాహుల్ గాంధీ బీజేపీ కుటుంబ పాలన కామెంట్‌కు ఘాటైన సమాధానం ఇచ్చారు. బీజేపీకి చెక్ పెట్టారు.
‘అసలు అమిత్ షా కొడుకు ఏం చేస్తుంటాడు? రాజ్‌నాథ్ సింగ్ తనయుడు ఏం పని చేస్తుంటాడు?’ అని రాహుల్ గాంధీ ఎదురు ప్రశ్నించారు. ‘చివరి సారిగా నేను ఈ ప్రశ్నకు సమాధానం.. అమిత్ షా కొడుకు క్యాంపెయినింగ్ చేస్తున్నాడని విన్నాను. బీజేపీలోని నేతలను చూడండి. మీ మనస్సాక్షిని ఒక సారి ప్రశ్నించుకోండి. ఆ బీజేపీ నేతల కొడుకులు ఏం చేస్తున్నారో ఒకసారి వాస్తవంగా ఆలోచనలు చేయండి. చాలా మంది నేతల కొడుకు వారి రాజకీయ వారసులుగా ఉన్నారు’ అని రాహుల్ గాంధీ కరుకైన సమాధానం చెప్పారు.
Also Read: Israel-Hamas War: ఇజ్రాయెల్‌లో అష్కెలాన్‌లోని బాంబ్ షెల్టర్ లోపల ఇలా..
రాహుల్ గాంధీ తండ్రి, తాత, నానమ్మలు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా చేశారు. కుటుంబ పాలన గురించి వచ్చిన ప్రశ్నలపై స్పందిస్తూ 2017లో రాహుల్ గాంధీ వారసత్వ పాలన దేశానికి చేటు అని అంగీకరించారు.