కోవిడ్ 19 మహమ్మారిని నియంత్రించే క్రమంలో అందుకు సన్నద్ధమవ్వడానికి తగినంత సమయం ఉన్నప్పటికీ దానిని సరిగా ఉపయోగించుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని రాహుల్ ఆరోపించారు.
భారత్‌లో కరోనా వైరస్‌ల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కోవిడ్ 19 మహమ్మారిని నియంత్రించే క్రమంలో అందుకు సన్నద్ధమవ్వడానికి తగినంత సమయం ఉన్నప్పటికీ దానిని సరిగా ఉపయోగించుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని రాహుల్ ఆరోపించారు.
ఇది చాలా బాధాకరమైన విషయమని, కరోనాను పూర్తిగా కట్టడి చేసే అవకాశమున్నా, సీరియస్‌గా తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. అలాగే వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చప్పట్లు కొట్టాలని పిలుపునివ్వడాన్ని రాహుల్ తప్పుబట్టారు.
Also Read:ఇండియాలో 511కు పెరిగిన కరోనా కేసులు: రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవీ...
అంతకుముందు హర్యానాకు చెందిన డాక్టర్ కమ్మ కక్కర్ కరోనాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కోసం వచ్చే వారు ఎన్ 95 మాస్కులు, గ్లౌజులు తన సమాధిపై వేసిపోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం చప్పట్లు మాత్రమే కొడుతున్నారని.. అభినందనలే కావొచ్చు, కానీ ప్రభుత్వ వైద్యులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆమె ట్వీట్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ ట్వీట్‌లో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్, హర్యానా సీఎంవో, హర్యానా హెల్త్ మినిస్టర్‌లను ఆమె ట్యాగ్ చేశారు.
Also Read:లెక్కలేని తనం.. లాక్‌డౌన్ ఉల్లంఘన: 255 మంది అరెస్ట్
కాగా మంగళవారం సాయంత్రం నాటికి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 511కు చేరింది. అత్యథికొగా మహారాష్ట్రలో 106 మందికి వైరస్ సోకింది. దేశంలో దాదాపు 20కి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించారు.
