Asianet News TeluguAsianet News Telugu

లెక్కలేని తనం.. లాక్‌డౌన్ ఉల్లంఘన: 255 మంది అరెస్ట్

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. కానీ ఇవేవీ పట్టని  కొందరు ఏమాత్రం బాధ్యత లేకుండా రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు.

255 arrested for violating COVID 19 lockdown in Kolkata
Author
Kolkata, First Published Mar 24, 2020, 3:24 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. కానీ ఇవేవీ పట్టని  కొందరు ఏమాత్రం బాధ్యత లేకుండా రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు.

దీనిపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ హెచ్చరికలను పెడచెవిన పెట్టి అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంపు

ఈ విధంగా ఆంక్షల్ని ఉల్లంఘించిన 255 మందిని కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం నిబంధనలు పాటించని వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటి వరకు ఏడు కరోనా కేసులు నమోదవ్వగా, ఒకరు మరణించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేయగా, వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలను మూసివేశారు.

Also Read:ముంబైలో మరో కరోనా మరణం: దేశంలో 11కు చేరిన మృతుల సంఖ్య

మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ కేసులు 492కి చేరగా, 9 మంది మరణించారు. వీరిలో 37 మంది కోలుకోగా.. 446 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళలో అత్యథికంగా 95 కరోనా కేసులు నమోదవ్వగా, ఆ తర్వాత మహారాష్ట్ర 87 కేసులతో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios