సినీ నటి, బీజేపీ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ 2018లో చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సమయంలో ఆమె మోడీ అంటే అవినీతికి చిరునామా అంటూ పేర్కొన్నారు. అయితే అప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 

2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్ గాంధీకి జైలు శిక్ష ఖరారు అయ్యింది. దీంతో పాటు ఆయన లోక్‌సభ నుండి సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ చేసిన పాత ట్వీట్ వైరల్‌గా మారింది. ఆమె 2018లో చేసిన ట్వీట్ లో.. మోడీ ఇంటి పేరు అవినీతిగా మారిందని విమర్శించారు. అయితే ఆమె ఆ సమయంలో కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్నారు.

షాకింగ్ ఘ‌ట‌న‌.. ప్రియుడి సాయంతో మైన‌ర్ కొడుకు, కుమార్తె చంపిన మహిళ..

ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనేక మంది సోషల్ మీడియా యూజర్లు ఈ ట్వీట్ ను తమ ఖాతాల ద్వారా షేర్ చేస్తున్నారు. దీనిపై కూడా గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ.. ఖుష్బూ సుందర్‌పై కేసు వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు... అయితే ఈ ట్వీట్ పై ఖుష్బూ ఇంత వరకు స్పందించలేదు. అలాగే దానిని తొలగించలేదు. 

Scroll to load tweet…

‘మోడీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యల కారణంగా రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది, దీంతో ఆయన లోక్‌సభకు అనర్హత వేటు పడింది. ఈ నిర్ణయం ప్రతిపక్ష పార్టీలను ఆగ్రహానికి గురి చేసింది. వారు దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా ఖండించారు. గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనను ప్రకటించింది. సూరత్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది. 

ఈరోజు మధ్యాహ్నం రాహుల్ గాంధీ ప్రెస్ మీట్.. అనర్హత వేటుపై ‘జన్‌ ఆందోళన్‌’పేరుతో కాంగ్రెస్ నిరసన..!

కాగా.. ఈ కేసు విచారణ సందర్భంగా గాంధీ తరపు న్యాయవాది కోర్టులో క్షమాపణ అడగలేదు. అయితే ఈ వ్యాఖ్య ఉద్దేశపూర్వకంగా చేయలేదని, ఫిర్యాదుదారు పూర్ణేష్ మోడీని బాధపెట్టలేదని పేర్కొన్నారు. పాట్నాలో కూడా రాహుల్ గాంధీపై కూడా ఇలాంటి పరువు నష్టం కేసు ఒకటి దాఖలైంది. సుశీల్ మోడీ దీనిపై ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని పేర్కొన్నారు. 

క‌రోనాతో త‌ల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల‌కు ప్ర‌భుత్వ‌ ఆర్థిక సాయం

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటు వేయడాన్ని భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యుడు రో ఖన్నా తప్పుబట్టారు. ఇది గాంధీ తత్వానికి, భారతదేశపు లోతైన విలువలకు తీవ్ర ద్రోహం అని అభివర్ణించారు. దేశ రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ నేత జైరాం రమేష్ జాతీయ కేంద్రం తీరుపై మండిపడ్డారు.