Mumbai: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలిదశకు అనూహ్య స్పందన రావడంతో ఇప్పుడు గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రెండో దశను ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు. అదే సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పాదయాత్రలు నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు.
Bharat Jodo Yatra 2: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో యాత్ర గుజరాత్ నుంచి ప్రారంభమై ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ వరకు సాగనుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. భారత్ జోడో యాత్ర రెండో షెషన్ ప్రారంభం క్రమంలోనే రాష్ట్రంలోని పార్టీ నాయకులు సమాంతర మార్చ్ నిర్వహిస్తారని ఆయన చెప్పారు. "రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో యాత్ర గుజరాత్ ప్రారంభమై మేఘాలయ వరకు కొనసాగనుంది. పశ్చిమ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖ కాంగ్రెస్ నేతలు భారత్ జోడో యాత్ర రెండో దశ పాదయాత్రకు నేతృత్వం వహించనున్నారని" తెలిపారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలిదశకు అనూహ్య స్పందన రావడంతో ఇప్పుడు గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రెండో దశను ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు. అదే సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పాదయాత్రలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
తొలిదశ యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4 వేల కిలోమీటర్లు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నడిచారు. గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 3,970 కిలో మీటర్లు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసి 130 రోజులకు పైగా కొనసాగిన తర్వాత జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది. కాగా, అయితే, భారత్ జోడో యాత్ర-2 కొత్త రూట్, సంబంధిత తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ధృవీకరించబడలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, భారత్ జోడో యాత్ర ముగిసిన రెండు నెలలకే రాహుల్ గాంధీ.. 'మోడీ' ఇంటిపేరు వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే, లోక్ సభ ఎంపీ పదవికి కూడా అనర్హత వేటు పడింది. అయితే గత వారం సుప్రీంకోర్టు ఆయనకు విధించిన శిక్షపై స్టే విధించడంతో సోమవారం ఆయన తిరిగి లోక్ సభ ఎంపీగా కొనసాగుతారని పార్లమెంట్ వర్గాలు ప్రకటించాయి.
కాగా, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విఫలమైందనీ, మహారాష్ట్ర కాంగ్రెస్ కు కూడా అదే గతి పడుతుందని బీజేపీ విమర్శించింది. ''రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విఫలమైంది. యాత్ర ముగిసిన తర్వాత ఆయా రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత కూడా అదే ఉదాహరణను అనుసరించాలనుకుంటున్నారా? ప్రజలతో సంబంధం లేదు కాబట్టే కాంగ్రెస్ పాదయాత్ర చేస్తోంది. దీనికితోడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి కొంత ఉనికి ఉన్న కోకాన్ ప్రాంతంపై వారు దృష్టి సారించారు. మహావికాస్ అఘాడీ కేవలం కాగితాలపై మాత్రమే ఉందని స్పష్టమవుతోంది'' అని మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మాధవ్ భండారీ అన్నారు.
