Asianet News TeluguAsianet News Telugu

ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంట్ కు రాహుల్ గాంధీ..నూతనవ్యవసాయ చట్టాలపై నిరసనగా..

రాహుల్ గాంధీ షర్ట్, ట్రౌజర్ లో ముహానికి మాస్క్ తో ఎర్ర ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుతూ పార్లమెంటుకు వచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. " రైతుల సందేశాన్ని ఇలా పార్లమెంటుకు తీసుకువచ్చాను.

Rahul Gandhi Rides Tractor In Heart Of Delhi To Protest Farm Laws - bsb
Author
Hyderabad, First Published Jul 26, 2021, 11:55 AM IST

న్యూ ఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయచట్టలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ట్రాక్టర్ మీద పార్లమెంటుకు వచ్చి రైతులకు తన మద్దతు, నూతన వ్యవసాయచట్టలమీద వ్యతిరేకత ప్రదర్శించారు. 

రాహుల్ గాంధీ షర్ట్, ట్రౌజర్ లో ముహానికి మాస్క్ తో ఎర్ర ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుతూ పార్లమెంటుకు వచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. "నేను రైతుల సందేశాన్ని పార్లమెంటుకు తీసుకువచ్చాను. వారు (ప్రభుత్వం) రైతుల గొంతులను అణచివేస్తున్నారు. పార్లమెంటులో చర్చ జరగనివ్వరు. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందే. ఈ చట్టాలు ఇద్దరు, ముగ్గురు పెద్ద వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉన్నాయని దేశమంతా తెలుసు’ అని అన్నారు. 

"ప్రభుత్వం లెక్కల ప్రకారం, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. బయట కూర్చుని నిరసన తెలుపుతున్న రైతులు ఉగ్రవాదులు. కానీ వాస్తవం అదికాదు. ప్రభుత్వం రైతుల హక్కులు కొల్లగొడుతోంది" అని ఆయన చెప్పారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధర లేదా ఎంఎస్‌పికి హామీ ఇవ్వాలని, కొత్త చట్టాలను ఎత్తి వేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దు పాయింట్ల వద్ద నవంబర్ నుండి వేలాది మంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ దివస్ : కార్గిల్ వీరులకు వందనం.. తాశి నామ్‌గ్యాల్‌ తో బయటపడ్డ పాక్ కుట్ర... !

గత వారం పార్లమెంట్ మాన్ సూన్ సెషన్స్ ప్రారంభమైనప్పటి నుండి, వ్యవసాయ చట్టాలపై పార్లమెంటు అనేకసార్లు వాయిదా పడింది. కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు ఈ విషయం పరిష్కరించే వరకు సభ పనిచేయడాన్ని నిరాకరించారు. పార్లమెంటు వెలుపల నిరసన తెలిపారు. శిరోమణి అకాలీదళ్ కూడా దీనిమీద చర్చ కోరింది.

వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ చట్టాలు ప్రయోజనకరంగా ఉన్నాయని, రైతులు సమస్యలను వ్యక్తం చేస్తే వాటిని "పాయింట్ల వారీగా" చర్చించవచ్చని అన్నారు. వివాదాస్పద చట్టాలపై ప్రతిష్టంభనను తొలగించడంలో రైతులు, ప్రభుత్వం మధ్య అనేక రౌండ్ల చర్చలు విఫలమయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios