Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో బాంబే హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు ఆర్ఎస్ఎస్ పేరును ముడిపెట్టి రాహుల్ గాంధీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2017లో గౌరీ లంకేశ్‌ హత్యను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో ముడిపెట్టిన రాహుల్‌పై ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసు నమోదు చేసింది.

Rahul Gandhi moves Bombay High Court in defamation case filed by RSS worker krj
Author
First Published Oct 18, 2023, 5:32 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు సంబంధం ఉందంటూ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ పై పరువు నష్టం దావా దాఖలైంది.

తాజాగా ఈ పరువునష్టం ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బోరివాలి మేజిస్ట్రేట్ కోర్టు 2019 ఉత్తర్వులను రాహుల్ తన లాయర్ ద్వారా సవాలు చేశారు. 2017లో గౌరీ లంకేశ్‌ హత్యను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో ముడిపెట్టిన రాహుల్‌పై పరువునష్టం కేసు నమోదైంది.

పిటిషన్‌లో రాహుల్ గాంధీ ఏం చెప్పారు?

సీతారాం ఏచూరిపై దాఖలైన కేసుతో తనపై కేసును ముడిపెట్టలేమని రాహుల్ గాంధీ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో ప్రకటనలు ఇచ్చారు. మేమిద్దరం వ్యతిరేక సిద్ధాంతాలు కలిగిన రెండు వేర్వేరు పార్టీలకు చెందినవాళ్లం. అటువంటి పరిస్థితిలో ఉమ్మడి విచారణ నా కేసును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.  

 డిసెంబర్ 5గా విచారణ

జస్టిస్ ఎస్వీ కొత్వాల్ ఈ పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 5న వాయిదా వేశారు. లాయర్ ధృతిమాన్ జోషి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ , యేచూరిలపై 2017లో మేజిస్ట్రేట్ ముందు ప్రైవేట్ ఫిర్యాదును దాఖలు చేశారు. వారిపై పరువు నష్టం కోసం చర్యలు తీసుకోవాలని కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios