తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ సముద్రంలో కొద్దిసేపు సరదాగా ఈత కొట్టారు.

కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఆయన బుధవారం నాడు కేరళ రాష్ట్రంలో పర్యటించారు. కొల్లాం జిల్లాలోని తంగసెరీ బీచ్  నుండి సముద్ర జలాల్లో ఆయన ప్రయాణించారు. జాలర్లతో కలిసి ఆయన సముద్ర జలాల్లో గడిపారు.

 

సముద్ర జలాల్లో జాలర్లతో కలిసి ఆయన సముద్రంలో ఈత కొట్టారు. జాలర్లు సముద్రంలో దూకగానే వారితో పాటు రాహుేల్ గాంధీ కూడ నీటిలో దూకాడు.తమకు ఏ మాత్రం చెప్పకుండానే రాహుల్ గాంధీ సముద్రంలో దూకాడని ఆయనతో పాటు ఈత కొట్టిన జాలర్లు చెప్పారు.రాహుల్ గాంధీ ఫర్‌ఫెక్ట్ ఈతగాడని జాలర్లు చెప్పారు.

బ్లూ కలర్ టీ షర్ట్ , ఖాకీ ట్రోజర్ ధరించిన రాహుల్ గాంధీ సముద్రంలోకి దూకాడు. ఒడ్డుకు చేరుకొన్న తర్వాత ఆయన డ్రెస్ మార్చుకొన్నాడు. 

సముద్రంలో రాహుల్ గాంధీ సుమారు రెండున్నర గంటల పాటు గడిపాడు. మత్స్యకారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.మత్య్సకారుల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖను కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.