ట్రక్కు, పికప్ వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో 11 మంది మరణించారు. మరో 10 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బలోదబజార్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు పికప్ వ్యాన్ ను ఢీనడంతో 11 మంది మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బలోదబజార్ జిల్లాలోని భాటాపరా వద్ద గురువారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు, పికప్ వ్యాన్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో ఒక్క సారిగా అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.
కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాను విమానం నుంచి దింపి.. అరెస్ట్, విడుదల, మధ్యంతర బెయిల్..
అర్జుని ప్రాంతంలో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో పాల్గొని కుటుంబ సభ్యులంతా పికప్ వాహనంలో ప్రయాణం ప్రారంభించారు. అయితే వాహనం భాటాపరా ప్రాంతానికి చేరుకునే సరికి ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వ్యాన్ లో ఉన్న 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్డీఓపీ భటపర సిద్ధార్థ్ బఘేల్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని రాయ్‌పూర్‌కు తరలించారు.
ఎన్సీపీలో ముదిరిన పోస్టర్ వార్.. 'కాబోయే సీఎం' అంటూ సుప్రియా సూలే ఫెక్సీ
ఇలాంటి ఘటనే గురువారం రుదౌలి కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ పికప్ ట్రక్ బైక్ ను వెనకాల నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో సేల్స్‌మెన్ చనిపోయారు. ఈ ఘటన స్థలానికి కేవలం కిలో మీటర్ దూరంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు బైక్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు.
జాతీయ భద్రతపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారంటే..?
ఫిబ్రవరి 9వ తేదీన కాంకేర్ జిల్లాలో స్కూల్ స్టూడెంట్లను తీసుకెళ్తున్న ఆటో రిక్షా ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు చనిపోయారు. ఓ డ్రైవర్ గాయపడ్డారు. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోని కోరర్ గ్రామ సమీపంలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులకు హాస్పిటల్ కు తరలించారు.
