రాహుల్ గాంధీకి ఎలాగూ రాజకీయంగా ఉత్పాదక లేదని, కానీ ఆయన సభ ఉత్పాదకతను కూడా దెబ్బతీయడానికి ప్రయత్నించవద్దని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఆయన అమేథీ నుంచి ఎంపీగా ఉన్నప్పుడు లోక్ సభలో ఒక్క ప్రశ్న కూడా అడగలేదని చెప్పారు.
రాహుల్ గాంధీకి రాజకీయంగా ఉత్పాదకత లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ సభ ఉత్పాదతకను అడ్డుకోవడం సరైందని కాదని అన్నారు. పెరిగిన ధరలను నిరసిస్తూ పార్లమెంటులో కాంగ్రెస్ నిరసన చేపట్టింది. దీంతో సోమవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్మృతి ఇరానీ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.
Karnataka: "రాష్ట్రంలో భిక్షాటన నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం"
దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలపై ప్రభుత్వం చర్చించాలని భావిస్తుంటే ప్రతిపక్షాలు దూరంగా పారిపోతున్నాయని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ.. ఆయన రాజకీయ జీవితం పార్లమెంటరీ విధానాలు, సంప్రదాయాలను అగౌరవపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఆయన ఇప్పుడు లోక్‌సభ ఉత్పాదకతను తగ్గించాలని పట్టుదలతో ఉన్నారని ఆమె మీడియాతో అన్నారు.
Sena Vs Sena : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోరు : సుప్రీంకోర్టు
2004-2019 మధ్య అమేథీ ఎంపీగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ప్రశ్న అడగలేదని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఆ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వయనాడ్ కు ఎంపీగా అయ్యారని, 2019లో జరిగిన శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో ఆయన హాజరు 40 శాతం కంటే తక్కువగా ఉందని ఇరానీ చెప్పారు. ఆయన ఎప్పుడూ ఏ ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా ప్రతిపాదించలేదని ఆమె తెలిపారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీపై గెలుపొందిన విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీ తరచూ విదేశీ పర్యటనలు చేయడంపై కూడా ఆమె మండిపడ్డారు. ఇది అతని సొంత పార్టీకి ఆందోళన కలిగించే విషయంగా మారిందని అన్నారు. ఆయన రాజకీయ జీవితం పార్లమెంటరీ సంప్రదాయాలను అగౌరవపరిచేలా గడిచిందని, ఇప్పుడు కూడా ఇప్పుడు పార్లమెంట్ కార్యకలాపాలు, చర్చలు జరగకుండా ప్రయత్నిస్తున్ంనారని ఆరోపించారు. ‘‘ ఆయన రాజకీయంగా ఉత్పాదకత లేనివాడు కావచ్చు. కానీ పార్లమెంటు ఉత్పాదకతను నిరంతరం అరికట్టడానికి ధైర్యం చేయకూడదు ’’ అని అన్నారు.
