రాహుల్ గాంధీ యూకే పర్యటనపై బీజేపీ కావాలనే అజ్ఞానంతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. ఆయన ఒక ఎంపీ మాత్రమే అని, కేంద్ర మంత్రి లేదా ప్రభుత్వ ఉద్యోగి కారని చెప్పింది. కాబట్టి రాజకీయ అనుమతులు ఆయన కు అవసరం లేదని తెలిపింది. 

కాంగ్రెస్ అధినాయ‌కుడు రాహుల్ గాంధీ యూకే పర్యటన చర్చనీయాంశం అవుతోంది. ఆయ‌న లండ‌న్ లో బ్రిటిష్ లేబ‌ర్ పార్టీ నాయ‌కుడు, ఎంపీ జెరెమీ కోర్బిన్ తో స‌మ‌వేశం అవ‌డం వివాదాస్ప‌దం అయ్యింది. దీంతో రాహుల్ గాంధీ యూకే ప‌ర్య‌ట‌న కోసం ఎలాంటి రాజ‌కీయ అనుమ‌తి పొందలేద‌ని ప్రభుత్వ వర్గాలు బుధవారం ప్ర‌క‌టించాయి ఆయ‌న స‌రైన విధానాన్ని విస్మ‌రించార‌ని తెలిపాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రాహుల్ గాంధీ మంత్రి కాదని ఆయ‌న‌కు రాజ‌కీయ అనుమ‌తి అస‌వ‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. 

‘‘ రాహుల్ గాంధీ రాజకీయ అనుమతి పొందాల్సిన అవసరం లేదు. ఆయ‌న ఎఫ్‌సీఆర్ ఏ అనుమ‌తి పొందారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయనకు ఎలాంటి రాజకీయ అనుమతి అవసరం లేదు. ’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా మీడియాతో గురువారం మాట్లాడారు. ‘‘ బీజేపీ కావాలనే అజ్ఞానంతో వ్యవహరిస్తోంది. ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ విదేశాలకు వెళ్లాల్సి వస్తే, కేవ‌లం ఎఫ్‌సీఆర్ క్లియ‌రెన్స్ అవ‌స‌రం. అది రాహుల్ గాంధీకి ల‌భించింది.’’ అని ఆయ‌న చెప్పారు. ఎమ్మెల్యే లేదా ఎంపీకి రాజకీయ క్లియరెన్స్ అవసరం లేదని తెలిపారు. 

ముందు తృణమూల్ సాయం కోరిన కపిల్ సిబాల్.. మమత షరతు, అందుకే అఖిలేష్‌ వైపునకు..

‘‘ మీరు ప్రభుత్వ ఉద్యోగి లేదా కేంద్ర మంత్రి అయితే మీకు రాజకీయ క్లియరెన్స్ అవసరం. ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేదా ఎమ్మెల్సీ విదేశీ పర్యటనలకు రాజకీయ అనుమతి అవసరం లేదని నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే ప్రభుత్వోద్యోగి కాదు. వారు ప్రజల సేవకులు, అందువల్ల వారు ప్రభుత్వేతర పర్యటనలలో ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండరు ’’ అని ఆయన వాదించారు. 

ఇటీవ‌ల లండన్ లో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో రాహుల్ గాంధీ ప్ర‌సంగించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. భారత రాజ్యాంగంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రతీ అంశంపై ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.భార‌త్ ఇప్పుడు మంచి స్థానంలో లేద‌ని అన్నారు. ఒక చిన్న నిప్పు ర‌వ్వ కూడా ఇప్పుడు పెద్ద ఇబ్బందుల‌కు దారి తీస్తుంద‌ని తెలిపారు. ప్రతిపక్షాలు, ప్రజలు, వర్గాలు, రాష్ట్రాలు, మతాలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 

Rajya Sabha Election 2022: రాజ్యసభలో పెరగనున్న కాంగ్రెస్ బలం.. 11 రాజ్యసభ సీట్లు లభించే చాన్స్..!

అంద‌రినీ ఏక‌తాటిపైకి తీసుకురావ‌డానికి ప్ర‌తిపక్షాలు, కాంగ్రెస్ కూడా బాధ్య‌త వ‌హించాల్సి ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ‘‘ మేము ఈ ఉష్ణోగ్రతను చల్లబరచాలి. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత చల్లబడకపోతే విషయాలు తప్పు కావచ్చు" అని చెప్పారు. భారతదేశంలో రెండు విభిన్నమైన పాలనా విధానాలు ఉన్నాయని.. అందులో ఒకటి గొంతులను అణచివేసేదని, మరొకటి వినేదని అన్నారు. ‘‘ బీజేపీ లాంటి క్యాడర్‌ ఉండాలని ప్రజలు అంటున్నారు. కానీ అలాంటి క్యాడర్ ఉంటే మ‌నం బీజేపీయే అవుతామ‌ని నేను వారికి చెబుతున్నాను. భారతీయ ప్రజల భావాలను వినే పార్టీ మాది. BJP గొంతులను అణచివేస్తుంది, మేము వింటాము. దయచేసి గ్రహించండి, BJP అరుస్తుంది. గొంతుల‌ను అణచివేస్తుంది. కానీ మాకు విన‌డ‌మే తెలుసు. అవి రెండు వేర్వేరు విషయాలు. అవి రెండు వేర్వేరు డిజైన్‌లు. ’’ అని రాహుల్ గాంధీ అన్నారు.