కశ్మీర్‌లో టెర్రరిస్టులు నా వద్దకు వచ్చి మాట్లాడారు.. నన్ను చంపేసేవారు: కేంబ్రిడ్జీ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ

భారత్ జోడో పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ జమ్ము కశ్మీర్‌లో అడుగుపెట్టినప్పుడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన వద్దకు వచ్చి తాము మాట్లాడతామని కోరినట్టు వివరించారు. నిజంగానే ప్రజల గోస వినడానికి వచ్చారా? అని అడిగారని పేర్కొన్నారు. ఆ తర్వాత వారంతా ఉగ్రవాదులను తనకు చెప్పారని, వారు తలుచుకుంటే నన్ను చంపేయగలవారే అని తెలిపారు.
 

rahul gandhi disclose his encounter with terrorists in jammu kashmir while bharat jodo yatra

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ కేంబ్రిడ్జీ యూనివర్సిటీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర భారత్ జోడో ప్రస్తావన తెచ్చారు. తాను కశ్మీర్ వెళ్లినప్పుడు కొందరు టెర్రరిస్టులు తన వద్దకు వచ్చారని అన్నారు. తనతో మాట్లాడారని, నన్ను చంపేసేవారే అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మంగళవారం వారంపాటు యూకేలో పర్యటించడానికి వెళ్లారు. ఈ టూర్‌లో భాగంగా కేంబ్రిడ్జీ యూనివర్సిటీలో ఆయన ప్రసంగించారు. ప్రవాస భారతీయులను చర్చలు జరిపారు.

ఈ రీజియన్‌లో పాదయాత్ర చేయరాదని సెక్యూరిటీ ఫోర్స్‌లు తనకు చెప్పాయని, ఇక్కడ ఉగ్రవాదులు దాడులు చేసే ముప్పు ఉన్నదని పేర్కొన్నాయని రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ తన యాత్రను కొనసాగించినట్టు వివరించారు. ‘నేను నా మనుషులతో మాట్లాడాను. ఈ యాత్రను కంటిన్యూ చేయాలనే అనుకుంటున్నట్టు తెలిపాను. అందుకు వారు కూడా అంగీకరించారు. ముందుకు కదిలాం. కొంత దూరం పాదయాత్ర చేశాక.. గుర్తు తెలియని ఓ వ్యక్తి నా వద్దకు వచ్చాడు. నాతో మాట్లాడాలని కోరాడు’ అని వివరించాడు.

నిజంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే కాంగ్రెస్ నేతలు జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోకి వస్తున్నారా? అని తనను ఆ గుర్తు తెలియని వ్యక్తి అడిగినట్టు రాహుల్ చెప్పారు. ఆ తర్వాత కొన్ని క్షణాలకు సమీపంలోని మరికొందరు వ్యక్తులను తనకు చూపించినట్టు తెలిపారు. వారంతా టెర్రరిస్టులే అని ఆ వ్యక్తి తనకు చెప్పినట్టు వివరించారు. ‘అప్పుడు నాకు నేను సమస్యలో పడ్డట్టు అనిపించింది. ఎందుకంటే టెర్రరిస్టులు తనను చంపగలిగేవారే. కానీ, వారు ఏమీ చేయలేదు. ఎందుకంటే.. అది వినడానికి ఉన్న శక్తి’ అని రాహుల్ గాంధీ తెలిపారు. కేంబ్రిడ్జీ ప్రసంగంలో ఆయన వినే కళ (ఆర్ట్ ఆఫ్ లిజనింగ్) గురించి మాట్లాడారు.

పెగాసెస్ గురించి ఏమన్నారంటే?

ప్రజాస్వామ్యానికి అవసరమైన వ్యవస్థాగత నిర్మాణంపై ఆంక్షలు పెరుగుతున్నాయని, భారత ప్రజాస్వామిక ప్రాథమిక నిర్మాణంపైనే దాడి జరుగుతున్నదని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెగాసెస్ తో తనపైనా నిఘా వేసిందని వివరించారు.

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్.. వ్యాపారవేత్త అమన్ దీప్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ..

‘భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నది. ప్రజాస్వామ్యంపై దాడిని తాము ఎదుర్కొంటున్నాం’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రతిపక్ష నేతలపై నిఘా వేయడానికి ప్రభుత్వం పెగాసెస్‌ను ఉపయోగించుకుంటున్నదని వివరించారు.

‘స్వయంగా నా ఫోన్‌లోనూ పెగాసెస్ చొప్పించారని వివరించారు. చాలా మంది నేతల ఫోన్‌లలో పెగాసెస్ ఉన్నదని తెలిపారు. తనపై నిఘా ఉన్నదని, ఫోన్‌లోనైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పారని వివరించారు. సెంటర్‌లోని ప్రభుత్వం మీడియా, జ్యుడీషియరీ, సర్వెలెన్స్, భయాందోళనలు సృష్టించడం, మైనార్టీ, దళితులు, గిరిజనులపై దాడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అసమ్మతిని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios