Asianet News TeluguAsianet News Telugu

Lakhimpur Kheri Violence : ఆ కేంద్రమంత్రి ఓ క్రిమినల్.. వెంటనే రాజీనామా చేయాలి.. లోక్ సభలో రాహుల్ ఫైర్...

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ rahul gandhi మాట్లాడుతూ.. అజయ్ మిశ్రాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఆయనో క్రిమినల్’ అని, వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘లఖింపుర్ ఖేరీ’ ఘటన ఓ కుట్ర అని తేలింది. ఈ ఘటనకు ఎవరి కుమారుడు బాధ్యుడో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ మంత్రి (అజయ్ మిశ్ర) resignation చేయాలని కోరుతున్నాను. దీని మీద పార్లమెంటులో చర్చ జరగాలి.

rahul gandhi demands minister ajay mishra resignation over lakhimpur kheri violence
Author
Hyderabad, First Published Dec 16, 2021, 12:43 PM IST

ఢిల్లీ : lakhimpur kheri  ఘటనపై పార్లమెంట్ ఉభయ సభలు గురువారం దద్దరిల్లాయి. ప్రణాళిక ప్రకారమే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇటీవల సంచనల విషయాలను వెల్లడించిన నేపత్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Ajay Mishraను తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష సభ్యులు లోక్ సభలో ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ rahul gandhi మాట్లాడుతూ.. అజయ్ మిశ్రాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఆయనో క్రిమినల్’ అని, వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘లఖింపుర్ ఖేరీ’ ఘటన ఓ కుట్ర అని తేలింది. ఈ ఘటనకు ఎవరి కుమారుడు బాధ్యుడో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ మంత్రి (అజయ్ మిశ్ర) resignation చేయాలని కోరుతున్నాను. దీని మీద పార్లమెంటులో చర్చ జరగాలి. కానీ, ప్రధాని అందుకు అంగీకరించట్లేదు. రైతుల హత్యకు కారణమైన ఆ మంత్రి ఓ క్రిమినల్, ఆయన రాజీనామా చేయాలి. ఆయనను కఠినంగా శిక్షించాలి’ అని రాహుల్ డిమాండ్ చేశారు. 

ఉభయ సభలు వాయిదా..
లఖింపుర్ ఖేరీ ఘటన మీద చర్చ జరపాల్సిందేనని Lok Sabha లో విపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభలో ఒకింత గందరగోళ వాతావరణం నెలకొంది. విపక్ష సభ్యులు ఆందోళన విరమించాలని స్పీకర్ వారించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అటు Rajya Sabhaలోనూ అదే గందరగోళం నెలకొంది. లఖింపుర్ ఘటనతో పాటు 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ పైనా ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. 

లోక్‌సభను కుదిపేసిన లఖింపూర్ ఖేరీ ఘటన.. రాహుల్ గాంధీ వాయిదా తీర్మానం.. కేంద్ర మంత్రిని తొలగించాలని డిమాండ్..

ఇదిలా ఉండగా, బుధవారం కాంగ్రెస్ నేతRahul Gandhi.. లఖింపూర్ ఘటపై సిట్ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలంటూ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను.. ప్రధాని మోదీ మంత్రివర్గం నుంచి తొలగించాలని రాహుల్‌ గాంధీ డిమాండ్ చేశారు. ‘లఖింపూర్‌లో రైతుల ఊచకోత ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని, నిర్లక్ష్యపు చర్య కాదని యూపీ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ తన నివేదిక హైలైట్ చేసింది. ప్రభుత్వం వెంటనే హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను తొలగించి.. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలి’ అని రాహుల్ గాంధీ తన నోటీసులో పేర్కొన్నారు.

అయితే రాహుల్ గాంధీ వాయిదా తీర్మానంపై లోక్‌సభ (Lok Sabha)  స్పీకర్ చర్చకు అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు చేపట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. అయితే వారి ఆందోళనల నడుమే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఎంత  చెప్పిన విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్.. లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios