ముగిసిన రాహుల్ తొలి సీడబ్ల్యూసీ మీటింగ్.. 2019 ఎన్నికలే టార్గెట్

rahul gandhi commments on CWC meeting
Highlights

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ సమావేశం ఇవాళ ఢిల్లీలో జరిగింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడయ్యాకా.. తొలిసారి సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ సమావేశం ఇవాళ ఢిల్లీలో జరిగింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడయ్యాకా.. తొలిసారి సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా 2019 ఎన్నికలు, పార్టీ బలోపేతంపైనే చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఈ సీడబ్ల్యూసీ సమావేశం గతానికి, భవిష్యత్తుకి వారిధిగా ఉంటుంది. దేశప్రజల గొంతుక వినిపించడానికి మేం సిద్ధంగా ఉన్నామని.. అది ఎప్పటికీ తమ బాధ్యత అని రాహుల్ అన్నారు.. ప్రస్తుతం దేశ ప్రజలంతా డేంజర్ జోన్‌లో ఉన్నారని.. వారిని కాపాడాల్సిన బాధ్యత తమపై  ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు..

సోనియా గాంధీ మాట్లాడుతూ....ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. తామంతా రాహుల్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.. ఈ సమావేశానికి కొత్త సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు సీనియర్  నేతలు సోనియా, మన్మోహన్, ఆజాద్, మోతీలాల్ వోరా, మల్లిఖార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. 

loader