చెన్నై: కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా బీచ్ లో చోటివ్వాలనే డిఎంకె డిమాండ్ కు కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. తమిళ ప్రజల గొంతుకు జయలలిత మాదిరిగానే కరుణానిధి కూడా ఓ వ్యక్తీకరణ అని ఆయన అన్నారు. ఆ గొంతుకు మెరీనా బీచ్ లో చోటు ఇవ్వాలని ఆయన అన్నారు. 

మెరీనా బీచ్ లో కరుణానిధి గొంతుకు స్థానం దక్కాల్సిందేనని, ఆ అర్హత కరుణానిధికి ఉందని అన్నారు. ఈ విషాదకరమైన సమయంలో తమిళనాడు నాయకులు ఉదారంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

కరుణానిధి నివాసానికి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు క్యూ కట్టారు. ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెన్నై చేరుకుని కరుణానిధికి నివాళులు అర్పించారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రేపు (బుధవారం) మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వస్తున్నారు.