Rahul Slams PM Modi: నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీని విమ‌ర్శించారు. దేశ ప్ర‌జ‌ల‌ను తప్పుదారి పట్టించారు. మోసం చేశారని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని విమ‌ర్శించారు.

Rahul Slams PM Modi: నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్ర‌వారం ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్ర‌ధాని అబ‌ద్ద ప్ర‌చారం చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ ఉద్యోగాలు ఎక్క‌డ ఉన్నాయ‌ని విమ‌ర్శించారు.

దేశ యువ‌త .. తప్పుదారి పట్టించడం, మోసం చేయడం వంటి అన్‌పార్లమెంటరీ పదాలను ఉపయోగించవ‌చ్చా? అని ప్రశ్నించారు. 2017 నుంచి 2022 వరకు ఐదేళ్లలో నిరుద్యోగం రెట్టింపు అయ్యిందని, గత ఐదేళ్లలో 20 నుంచి 24 ఏళ్లలోపు యువతలో నిరుద్యోగం రెట్టింపు అయ్యిందని, దీనికి దేశంలోని యువత కూడా బాధ్యత వహిస్తారా అని ప్రధానిపై రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.

రూపాయి విలువ పతనంపై రాహుల్ గాంధీ ఎగతాళి చేశారు. దేశం నిరాశా నిస్పృహల్లో మునిగిపోయిందని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఇవి మీ మాటలు కాదా ప్రధాని గారూ? ఆ సమయంలో ఎంత సందడి చేసేవాడో, ఈరోజు రూపాయి విలువ పతనాన్ని చూసి అంత మౌనంగా ఉన్నావు. ఈ ట్వీట్‌లో 'అబ్కీ బార్ 80 పర్' అనే హ్యాష్‌ట్యాగ్‌ని రాశారు. 

'అబద్ధాలుస‌ తప్పుదోవ పట్టించడం, ద్రోహం, మోసం

'సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎకానమీ' (CMII) డేటాను ఉటంకిస్తూ.. 'తప్పుదోవ పట్టించండి, మోసం చేయండి' అని ఆయన ట్విట్టర్‌లో గ్రాఫ్‌ను పంచుకున్నారు. ప్రధానమంత్రి, భారతదేశంలోని నిరుద్యోగ యువత మీ అబద్ధాల కోసం ఈ 'అన్‌పార్లమెంటరీ' పదాలను ఉపయోగించవచ్చా?' నిరుద్యోగం రేటు 21 శాతంగా ఉంది, ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 42 శాతానికి పెరిగిందని విమ‌ర్శించారు.

80కి 'అమృతకాల్'

డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనంపై కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డాలర్.. 80 రూపాయిలకు చేరుకోవడం 'అమృతకాల్' అని అన్నారు. "రూ. 40 వద్ద: 'ఉత్తేజం', 50 వద్ద: 'సంక్షోభం', 70 వద్ద: స్వావలంబన, 80 వద్ద: అమృతకల్" అని ట్వీట్ చేశారు. లోక్‌సభ సెక్రటేరియట్ ఇలా విడుద‌ల చేసిన అన్‌పార్లమెంటరీ ప‌దాల‌పై కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. 

జులై 18 నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల కోసం అన్‌పార్లమెంటరీ పదాల‌ను రిలీజ్‌ చేసిన విష‌యం తెలిసిందే.. అయితే ఈ పదాలపై రాహుల్‌ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. అన్‌పార్లమెంటరీగా నిర్వచనం.. ఇదేనంటూ న్యూ డిక్షనరీ ఫర్‌ న్యూ ఇండియా అని ట్విట్ చేశారు. ప్రధాని ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారో.. సరిగ్గా ఆ అంశంపై చర్చలకు, ఉపన్యాయాలకు సరిపోయే పదాలనే ఇప్పుడు అన్‌పార్లమెంటరీ పదాలుగా పేర్కొంటున్నారు. అంతేకాదు ఆ పదాలన్నింటితో కలిపి ఒక సెంటెన్స్‌ను తెలిపారు.