పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్షను సూరత్ కోర్టు విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లినా ఊరట దొరకలేదు. దీంతో తాజాగా, గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
న్యూఢిల్లీ: మోడీ ఇంటి పేరు కేసులో సూరత్ కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైకోర్టుకు వెళ్లారు. కానీ, ఆ కోర్టు కూడా రాహుల్ గాంధీకి ఊరట నివ్వలేదు. దీంతో తాజాగా ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి పేరుకు సంబంధించిన పరువునష్టం కేసులో తనను దోషిగా తేల్చడంపై స్టే ఇవ్వాలని ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. దిగువ కోర్టు తన అభ్యర్థనను తిరస్కరించడంతో ఆయన ఉన్నత న్యాయస్థానానికి చేరుకున్నారు.
కర్ణాటకలో 2019లో ఓ సభలో మాట్లాడుతూ దొంగలందరికీ మోడీ ఇంటి పేరే ఎందుకు ఉన్నదని ఆయన ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మోడీ ఇంటిపేరే ఉన్న ఓ గుజరాత్ ఎమ్మెల్యే సూరత్ కోర్టు పరువనష్టం కేసు వేశారు. ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. పరువునష్టం కేసులో గరిష్టంగా విధించే రెండు సంవత్సరాల శిక్షను రాహుల్ గాంధీకి విధించింది. పార్లమెంటు సభ్యత్వం కోల్పోవడానికి చట్టం ప్రకారం ఏ కేసులోనైనా రెండేళ్ల జైలు శిక్ష పడాలి.
సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును పైకోర్టులో సవాల్ చేసుకోవడానికి ఆయనకు 30 రోజుల వ్యవధిని ఇచ్చింది. దీంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై వేటు వేశారు.
Also Read: కేరళలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై కాంగ్రెస్ ఎంపీ పోస్టర్లు.. ఎంపీ ఏమన్నాడంటే?
సూరత్ కోర్టు తీర్పు సవాల్ చేస్తూ ఆయన పైకోర్టులో తన అభ్యర్థన నమోదు చేశారు. కానీ, ఆ కోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేదు. దీంతో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
