Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్సే మోడీ కులాన్ని ఓబీసీ‌లోకి మార్చింది .. నేనప్పుడు గుజరాత్‌కి డిప్యూటీ సీఎంని : బీజేపీ ఎంపీ

ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు నరహరి అమీన్ స్పందించారు. 25 జూలై 1994న ‘‘  Modh-Ghanchi ’’ సామాజిక వర్గాన్ని ఓబీసీ కేటగిరీలోకి చేర్చినప్పుడు తాను కాంగ్రెస్ ప్రభుత్వంలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా వున్నానని పేర్కొన్నారు. 

Rahul Gandhi, apologise: BJP MP Narhari Amin who was deputy CM when Modi's caste became OBC ksp
Author
First Published Feb 8, 2024, 7:27 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్ న్యాయ యాత్రలో భాగంగా ఒడిషాలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. మోడీ కులం గురించి అబద్ధం చెప్పారని, ఆయన పుట్టుకతో ఓబీసీ వర్గానికి చెందని వ్యక్తి కాదన్నారు.

ప్రధాని.. గుజరాత్‌లోని ‘‘ తెలి ’’ కులంలో జన్మించారని.. దీనిని 2000వ సంవత్సరంలో దీనిని ప్రభుత్వం జనరల్ విభాగం నుంచి ఓబీసీ కేటగిరీలోకి మార్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓబీసీ కుటుంబంలో జన్మించలేదు కాబట్టే ప్రధాని మోడీ.. తన జీవితాంతం కులగణనను అంగీకరించరని రాహుల్ ఎద్దేవా చేశారు. అయితే ఆ వెంటనే రాహుల్ తన వ్యాఖ్యలను సవరించారు. మోడీ ‘‘తెలి’’లో కాదని.. ‘‘ఘాంచీ’’ కులంలో పుట్టారని రాహుల్ దుయ్యబట్టారు. 

అయితే రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో నరేంద్ర మోడీ కులాన్ని ఓబీసీలో చేర్చడంపై మరోసారి వివాదం రాజుకుంది. ఇదే సమయంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కావడానికి ముందే .. ఆయన కులాన్ని అక్టోబర్ 27, 1999న ఓబీసీగా ప్రకటించినట్లుగా పలు నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు నరహరి అమీన్ స్పందించారు. 25 జూలై 1994న ‘‘  Modh-Ghanchi ’’ సామాజిక వర్గాన్ని ఓబీసీ కేటగిరీలోకి చేర్చినప్పుడు తాను కాంగ్రెస్ ప్రభుత్వంలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా వున్నానని పేర్కొన్నారు. ఈ కులానికి చెందిన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఓబీసీ వర్గాలను రాహుల్ గాంధీ అవమానిస్తున్నారని నరహరి చురకలంటించారు. 

ఈ ఇష్యూపై బుద్ధి లేకుండా అబద్దాలాడుతున్నారని , కేంద్రం నుంచి నోటిఫికేషన్ వెలువడే సమయానికి మోడీ.. కనీసం ఎంపీ, ఎమ్మెల్యే, సీఎంగా లేరని నరహరి తెలిపారు. రాహుల్ గాంధీ తక్షణం ఈ అసత్య వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబీసీల పరువు తీయడం మాని, ప్రధాని మోడీ పట్ల ద్వేషంతో మాట్లాడినందుకు గుజరాత్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నరహరి డిమాండ్ చేశారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios