Asianet News TeluguAsianet News Telugu

నేను బ్యాచిలర్‌గానే ఉండిపోయాను. ఎందుకంటే..: పెళ్లి ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇదే

‘నేను బ్యాచిలర్‌గానే ఉండిపోయాను. పనితో పూర్తి మమేకం అయ్యాను. కాంగ్రెస్ పార్టీ పనిలో మునిగిపోయాను. కాబట్టి, పెళ్లి చేసుకోలేదు’ అని రాహుల్ గాంధీ వివరించారు.
 

rahul gandhi answers why he did not marry kms
Author
First Published Oct 10, 2023, 6:15 PM IST

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత భిన్న వర్గాల ప్రజలతో కలిసి సరదాగా సంభాషిస్తున్నారు. అందులో వ్యక్తిగత విషయాలు మొదలు రాజకీయాలు, సామాజిక విషయాలూ ఉంటున్నాయి. సెప్టెంబర్ 23వ తేదీన విద్యార్థులతో ఆయన సంభాషిస్తూ కీలక విషయాలు వెల్లడించారు.

జైపూర్‌లోని మహారాణి కాలేజీలో విద్యార్థులతో ఆయన సంభాషణ వీడియో బయటికి వచ్చింది. అందులో ఓ విద్యార్థి రాహుల్ గాంధీని పెళ్లి గురించి అడిగింది. ‘నువ్వు చాలా స్మార్ట్‌గా, చూడటానికి బాగుంటావు. పెళ్లి గురించి నువు ఎందుకు ఆలోచించలేదు?’ అని ప్రశ్నించింది. దీనికి చాలా సింపుల్‌గా,  నిజాయితీగా రాహుల్ గాంధీ సమాధానం చెప్పారు. ‘ఎందుకంటే నేను పూర్తిగా నా పనిలో, కాంగ్రెస్ పార్టీ పనిలో మునిగిపోయాను’ అని వివరించారు.

మీకు ఇష్టమైన వంటకం ఏదని అడిగ్గా.. తాను కాకర వంటి చేదు, బీన్స్, పాలకూర తప్పితే అన్నింటినీ ఇష్టంగా భుజిస్తానని రాహుల్ గాంధీ తెలిపారు. మీకు ఇష్టమైన ప్లేస్ ఏది అని మరో స్టూడెంట్ అడిగారు. తాను అప్పటి వరకు చూడని ఏ ప్రాంతమైనా తనకు ఇష్టమే అని రాహుల్ గాంధీ తెలిపారు. ‘నాకు ఎప్పుడూ కొత్త ప్రాంతాలు చూడటం అంటే చాలా ఇష్టం’ అని వివరించారు. ముఖానికి తాను క్రీమ్ లేదా సోప్ పెట్టడని చెప్పారు. కేవలం నీటితో ముఖాన్ని కడుక్కుంటానని పేర్కొనడం గమనార్హం.

Also Read: హమాస్ అంటే ఏమిటీ? ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్‌లో ఏం జరుగుతున్నది?

స్వాతంత్ర్య సమరంలో పురుషులకు ఏమాత్రం తక్కువ కాకుండా మహిళలూ పాల్గొన్నారని, మరి వారికి ఎందుకు తక్కువ హక్కులు అని రాహుల్ గాంధీ ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ వివరించారు. మహిళలకు ఆర్థిక స్వతంత్రత గురించీ ఆయన మాట్లాడారు. ‘డబ్బు ఎలా పని చేస్తుంది? దాని శక్తి ఏమిటీ? అనే విషయాలను మహిళలకు వివరించరు’ అని సమాజంలో మహిళలపట్ల ఉన్న వివక్ష గురించి మాట్లాడుతూ తెలిపారు.

‘మీరు 20 ఏళ్ల నుంచి చదువుతున్నారు కదా. ఎవరైనా డబ్బు గురించి, దాని నిర్వచనం గురించి వివరించారా? ఎందుకు చెప్పలేదు?’ అని అడగ్గా.. ఈ విషయాలు తెలుసుకుంటే మహిళ స్వతంత్రంగా జీవించగలదని, అందుకే వారికి ఇవి నేర్పరని ఓ విద్యార్థిని తెలిపింది. 

‘ఒక మహిళ ఉద్యోగం చేసినా డబ్బును అర్థం చేసుకుంటే అర్థరహితం. అదే ఒక మహిళ ఉద్యోగం చేయకున్నా డబ్బు గురించి అర్థం చేసుకోగలిగింతే ఆమె శక్తవంతమైన మహిళ. అది చాలా గొప్ప విషయం. ఈ విషయాలను మహిళ అర్థం చేసుకోకుంటే, ఎల్లప్పుడు సంపాదించే పురుషుడిపై లేదా ఈ విషయాలను అర్థం చేసుకున్న పురుషుడిపై ఆధారపడాల్సి ఉంటుంది’ అని రాహుల్ గాంధీ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios