న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఇటీవలే ఆర్జేడీకి గుడ్ బై చెప్పిన  రఘువంశ్ ప్రసాద్ సింగ్  ఆదివారం నాడు మరణించారు.ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆదివారం నాడు కన్నుమూశారు. అతని వయస్సు 74 ఏళ్లు.
 

also read:లాలూకు షాక్: ఆర్జేడీకి రఘువంశ్ ప్రసాద్ సింగ్ గుడ్‌బై

రఘువంశ్ ప్రసాద్ సింగ్ కు ఈ ఏడాది జూన్ మాసంలో కరోనా సోకింది. కరోనాకు చికిత్స కోసం ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.శనివారం నాడు రాత్రి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించినట్టుగా ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో ఆయనను వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందించారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కు రఘువంశ్ ప్రసాద్ సింగ్ అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. కేంద్రంలో యూపీఏ -1 ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రఘువంశ్ ప్రసాద్ సింగ్ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. బీహార్ లోని వైశాలి ఎంపీ స్థానం నుండి ఆయన ప్రాతినిథ్యం వహించారు.

నాలుగు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో ఆయన కీలకపాత్ర పోషించాడు.ఈ నెల 11వ తేదీన రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆర్జేడీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖకు ఆర్జేడీ నాయకత్వానికి పంపారు.